రామ్ లల్లా విగ్రహం తయారీ కోసం శిల్పి అరుణ్ కష్టం.. ఒక్క కంటితోనే..

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి అంగరంగ వైభవంగా జరగనుంది.. అదే రోజు బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు తరలి రానున్నారు.

అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి అంగరంగ వైభవంగా జరగనుంది.. అదే రోజు బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ వేడుకకు లక్షల మంది భక్తులు తరలి రానున్నారు.

దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సంబంధించిన ముచ్చటే మాట్లాడుతున్నారు. అయోధ్యలో ఈ నెల 22 న కొత్తగా ఏర్పాటు చేసిన రామ మందిరం ప్రారంభోత్సవం ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోతుంది. ఆ రోజు బాలరాముని విగ్రహానికి ప్రాణ ప్రతిష్ట చేయనున్నారు. ఈ కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరగబోతుంది. అంగరంగ వైభవంగా సాగబోయే ఈ వేడుకకు దేశ వ్యాప్తంగా భక్తులు లక్షల్లో తరలిరానున్నారు. ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార దిగ్గజాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. బాలరాముని విగ్రహాన్ని సుప్రసిద్ద మైసూర్ శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దారు. తాజాగా విగ్రహ తయారీ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అయోధ్యలో జనవరి 22 న అయోధ్య రామ మందిరంలో రాముడి విగ్ర‌హానికి ప్రాణ ప్రతిష్ట చేయబోతున్నారు. కర్ణాటకకు చెందిన సుప్రసిద్ద శిల్ప కళాకారుడు అరుణ్ యోగిరాజ్ బాలరాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. ఇంత గొప్ప కార్యానికి అనుణ్ ని ఎంపిక చేయడం పట్ల అతని కుటుంబ సభ్యులు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. అదే సమయంలో శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్.. అరుణ్ యోగిరాజ్ ని ప్రశంసలతో ముంచెత్తారు. అరుణ్ యోగిరాజు బాలరాముని విగ్రహాన్ని తీర్చిదిద్దే సమయంలో ఎన్నో కఠిన నియమాలు పాటించారట. నెలల తరబడి తన కుటుంబంలోని ఎవరితోనూ మాట్లాడకుండా.. ఎంతో దీక్షా , అంకిత భావంతో ఈ కార్యాన్ని నెరవేర్చారని ట్రస్ట్ అధికారిక ప్రకటనలో పేర్కొంది.

ఈ సందర్భంగా అరుణ్ యోగిరాజ్ భార్య విజేత మాట్లాడుతూ.. ‘తన భర్త చెక్కిన విగ్రహం ఎంపిక చేయడం ఎంతో సంతోషంగా ఉంది, తమ జీవితం సార్థకమైంది. రామ్ లల్లా విగ్రం చెక్కిన విషయం తనకు కూడా చెప్పలేదు, మీడియా ద్వారానే ఈ వార్త తెలిసింది. వర్క్ విషయంలో ఆయన ఎప్పుడూ కాంప్రమైజ్ కారు. పని మొదలు పెడితే.. వంద శాతం పూర్తి చేస్తారం. ఏదైనా విగ్రహం చేయాంటే దాని గురించి రీసర్చ్ చేసి మరీ తయారు చేస్తారు. విగ్రహం తయారు చేసే సమయంలో పిల్లలను చూసుకోవడం కొంచెం కష్టం అనిపించిందని.. కానీ తన భర్త చేస్తున్న గొప్ప కార్యం ముందు ఆ బాధ చిన్నదనిపించింది. విగ్రహం తయారు చేసే సమయంలో నా భర్త అరుణ్ యోగిరాజ్ కి చిన్న ప్రమాదం జరిగింది. విగ్రహం తయారు చేస్తున్నపుడు రాయి వచ్చి ఆయన కంట్లో పడింది. వెంటనే అయోధ్య ట్రస్ట్ సభ్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయించారు. 15 రోజుల పాటు ఆయన ఒక్క కన్నుతోనే బాలరాముడి విగ్రహాన్ని తయారు చేశారు. ఇప్పుడు ఆయన చేసిన విగ్రహాన్ని ప్రపంచం మొత్తం చూస్తుంది. నా భర్తను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వాళ్లు అభినందించడం ఎంతో ఆనందంగా ఉంది’ అని అన్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments