ఆ రెండు బ్యాంకులకు RBI ఆంక్షలు .. మీకు అకౌంట్ ఉంటే త్వరపడండి?

RBI News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిల్లో కొన్ని కస్టమర్లకు సంతోషాన్ని ఇస్తుండగా, మరికొన్ని మాత్రం  ప్రతికూలంగా ఉంటాయి. తాజాగా రెండు బ్యాంకుల విషయంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.

RBI News: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిల్లో కొన్ని కస్టమర్లకు సంతోషాన్ని ఇస్తుండగా, మరికొన్ని మాత్రం  ప్రతికూలంగా ఉంటాయి. తాజాగా రెండు బ్యాంకుల విషయంలో ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం కాలంలో బ్యాంకులతోనే ఎక్కువ పనులు ఉంటాయి. అలానే బ్యాంకులు కూడా కస్టమర్లకు అనేక  సౌకర్యాలను, సదుపాయలను కల్పిస్తుంటాయి. అయితే ఈ బ్యాంకులను రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కింద పని చేస్తాయనే విషయం తెలిసిందే. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా బ్యాంకులు నడుస్తుంటాయి. అలానే తరచూ ఆర్బీఐ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. కొన్ని బ్యాంకులకు  సైతం షాకులు ఇస్తుంది. తాజాగా ఆర్‌బీఐ రెండు బ్యాంకులకు ఝలక్ ఇచ్చింది. దీంతో ఆ రెండు బ్యాంకుల కస్టమర్లకు షాక్ తగిలింది. అకౌంట్ లో ఎంత  ఉన్నా పరిమితికి మించి తీసుకోలేరు. మరి.. ఆ రెండు బ్యాంకులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తరచూ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. వాటిల్లో కొన్ని కస్టమర్లకు సంతోషాన్ని ఇస్తుండగా, మరికొన్ని మాత్రం  ప్రతికూలంగా ఉంటాయి. ముఖ్యంగా కొన్ని బ్యాంకులపై ఆర్బీఐ తీసుకునే నిర్ణయాలు ఆయా బ్యాంకుల వినియోదారులకు కూడా షాక్ తగిలినట్లు అవుతుంది. తాజాగా రెండు బ్యాంకులపై ఆర్బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. తాజాగా నిర్ణయంతో బ్యాంక్ అకౌంట్‌లో ఎంత డబ్బు ఉన్నా కూడా పరిమితికి మించి విత్‌డ్రా చేసుకోవడం సాధ్యం కాదు.

ఉత్తర్ ప్రదేశ్ కేంద్రం నేషనల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్‌ పని చేస్తుంది. ఈ బ్యాంక్ పై ఆర్‌బీఐ ఆంక్షలు తీసుకువచ్చింది. ఈ బ్యాంక్‌పై ఆర్‌బీఐ కఠిన ఆంక్షలు విధించిందనే చెప్పొచ్చు. ఈ బ్యాంక్‌లో ఖాతాలు కలిగిన కస్టమర్లకు రూ.10 వేల వరకు విత్‌ డ్రా లిమిట్ ను ఆర్బీఐ విధించింది. ఆ బ్యాంక్ ఆర్థిక స్థితిగతులు క్షీణించడంతో ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం అని చెప్పుకోవచ్చు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం-1949లోని సెక్షన్ 35ఏ కింద ఈ ఆంక్షలు విధించినట్లు ఆర్బీఐ వెల్లడించింది. నేషనల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంక్ పై ఆర్బీఐ విధించిన ఆంక్షలు ఏప్రిల్ 15 నుంచే ఈ ఆంక్షలు అమలులోకి వచ్చాయి. అంతేకాకుండా ఈ కోఆపరేటివ్ బ్యాంక్‌పై మరికొన్ని ఇతర ఆంక్షలు కూడా ఆర్బీఐ విధించింది. ముఖ్యంగా ఆ బ్యాంకులోని కస్టమర్లకు రుణాలు ఇవ్వకూడదని తెలిపింది.

అదే విధంగా ఇప్పటికే తీసుకున్న రుణాలను రెన్యూవల్ వంటివి కూడా చేయవద్దని ఆదేశించింది. అలాగే ఏ ఇతర ఇన్వెస్ట్‌మెంట్ల చేయకూడదని తెలిపింది. ఈ బ్యాంకు ఏవైనా ట్రాజెక్షన్లు  చేయాలంటే ఆర్‌బీఐ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ బ్యాంకు పై విధించిన ఆంక్షలు ఆరు నెలలు అమలులో ఉంటాయి. ఈ సమయంలౌ కస్టమర్లు ఒకటి కన్నా ఎక్కువ ఖాతాలు కలిగి ఉంటే.. అన్ని అకౌంట్లలోని బ్యాలెన్స్ నుంచి కేవలం రూ.10 వేల వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకోవచ్చు. అంతుకు మించి తీసుకోవడానికి అవకాశం లేదు.  ఈ బ్యాంకుతో పాటు మరో కో ఆపరేటివ్ బ్యాంక్ పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ముంబై కేంద్రంగా పని చేస్తున్నా సర్వోదయ కోఆపరేటివ్ బ్యాంక్‌పై కూడా ఆర్బీఐ కొరడా ఝుళిపించింది. పై బ్యాంకుకు చెప్పిన కారణాలనే ఈ బ్యాంకు విషయంలోను ఆర్బీఐ చెప్పింది.

ఈ బ్యాంక్‌పై రూ.15 వేల వరకు విత్‌డ్రా పరిమితిని విధించింది. ఈ రెండు బ్యాంకుల వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్‌బీఐ తెలిపింది. సర్వోదయ బ్యాంకుపై విధించిన ఆంక్షలు ఏప్రిల్ 15 నుంచే అమలులోకి వచ్చాయి. ఈ బ్యాంకు కి కూడా ఆరు నెలల వరకు ఈ ఆంక్షలు కొనసాగుతాయి. తర్వాత ఈ రెండు బ్యాంకుల పరిస్థితులను పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటారు. నేషనల్ అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకు  ఇచ్చిన ఆదేశాలను సర్వోదయ బ్యాంకుకు ఆర్బీఐ ఇవ్వడం జరిగింది. కాగా డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ స్కీమ్ కింద బ్యాంక్‌లో అకౌంట్ కలిగిన వారికి రూ. 5 లక్షల వరకు గరిష్టంగా లభిస్తాయి. అందువల్ల డబ్బులు కలిగిన వారికి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. మరి.. ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments