Rambhadracharya Swami-Ayodhya Verdict: అయోధ్య తీర్పు వెనక ఉన్న వ్యక్తి ఈయనే.. అంధుడైనా

Ayodhya: అయోధ్య తీర్పు వెనక ఉన్న వ్యక్తి ఈయనే.. అంధుడైనా

నేడ కోట్లాది మంది హిందువులు అ‍త్యంత సంతోషంగా రామ మందిర ప్రారంభోత్సవం జరుపుకుంటున్నారంటే దాని వెనక ఎందరో కృషి ఉంది. వారిలో ఒకరి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం.

నేడ కోట్లాది మంది హిందువులు అ‍త్యంత సంతోషంగా రామ మందిర ప్రారంభోత్సవం జరుపుకుంటున్నారంటే దాని వెనక ఎందరో కృషి ఉంది. వారిలో ఒకరి గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం.

ఐదు దశబ్దాల హిందువుల నిరీక్షనకు మరి కొన్ని గంటల్లో తెర పడనుంది. ఎన్నో పోరాటాలు, ఆందోళనల తర్వాత.. ఇప్పుడు అయోధ్యలో రాముడి మందిరం నిర్మాణం సాధ్యపడింది. ఆలయ నిర్మాణఃలో నేడు ముఖ్య ఘట్టమైన బాలరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ నేడు అనగా జనవరి 22, సోమవారం మధ్యాహ్నం.. అయోధ్య రామ మందిరంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహిస్తారు. ఈ ఘట్టాన్ని వీక్షించేందుకు భక్తులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. దేశమంతా ఎక్కడ చూసిన రామ నామం, అయోధ్య పేర్లే వినిపిస్తున్నాయి. నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఓ వ్యక్తి గురించి చెప్పుకోవాలి. ఆయన వల్లే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. దాని వల్ల నేడు మందిర నిర్మాణం సాధ్యం అయ్యింది. ఇంతకు ఎవరా వ్యక్తి అంటే..

అయోధ్య వివాదంలో.. రాముడిని గెలిపించిన వ్యక్తి పేరు రామభద్రాచార్యస్వామి.. ఈయన వల్లనే అయోధ్య తీర్పు ఏకపక్షంగా వచ్చింది. కానీ ఆ లోపం ఆయన ఎదుగుదలను ఆపలేదు. ఈ క్రమంలో అయోధ్య విచారణ సందర్భంగా రామభద్రాచార్య స్వామి ఋగ్వేదంలో శ్రీరాముల వారికి చెందిన 157 మంత్రాలు, వాటికి భాష్యాలను కోర్టులో చెప్పారు. అంధుడై ఉండి వేదాలు చెప్పడంతో అక్కడి వారు ఆశ్చర్యపోయారు. వేద శక్తి మహిమ, సనాతన ధర్మం గొప్పతనం గురించి తెలుసుకుని అవాక్కయ్యారు.

ఋగ్వేద మంత్రాలకు పద వాక్య ప్రమాణజ్ఞుడయిన శ్రీ నీలకంఠ పండితుడు ఏనాడో రాసిన భాష్యం.. మంత్ర రామాయణం.  దీనిలో 157 ఋగ్వేద మంత్రాలకు భాష్యం ఉంది. దీనిలో దశరథుని పుత్ర కామేష్టి నుంచి సీతా మాతా భూమిలోకి ప్రవేశించే ఘట్టం వరకు ఉంది. వీటన్నింటిని రామభద్రాచార్య స్వామి కోర్టు వాదనల సందర్భంగా విన్నవించారు.

రామజన్మభూమి వివాదం గురించి కోర్టులో వాదనలు జరుగుతున్నప్పుడు జడ్జీలలో ఒకరు.. హిందువులు అన్నింటికి వేదం ప్రమాణమంటారు కదా.. మరి ఆ వేదాలలో రాముడి గురించి ఎక్కడ ఉందో చెప్పమని ప్రశ్నించారట. అప్పుడే అయోధ్య ఆలయం తరఫున వాదనలు వినిపిప్తున్న లాయర్‌.. రామభద్రాచార్య స్వామిని కోర్టుకు తీసుకు వచ్చి సాక్ష్యం ఇప్పించారు. అంధుడైనప్పటికి.. ఆయన అనర్గళంగా ఆయన ఋగ్వేద మంత్రాలు చదువుతూ దాని భాష్యం చెబుతూ రామకథను వివరిస్తూంటే జడ్జీలతో సహా కోర్టులో ఉన్న వారంతా నివ్వెరపోయారు.

అంధుడు పుస్తకం, మనిషి అవసరం లేకుండా అతి ప్రాచీనమైన ఋగ్వేద మంత్రాలు, దాని భాష్యం చెప్పడం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచింది. అలా రాముడిని గెలిపించడంలో రామభద్రాచార్య స్వామి కీలక పాత్ర పోషించారు. నేడు మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆయనను గుర్తు చేసుకుంటున్నారు.  రామభద్రాచార్య స్వామి విషయానికి వస్తే.. ఆయన ఒక మఠానికి అధిపతి కూడా. ఏది ఏమైనా కోట్లాది మంది హిందువుల కల నెరవేర్చడంలో ఈయన కృషి మరపురానిది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.

Show comments