Prize of lakhs of rupees for those who ate omelette: బంపరాఫర్.. ఆమ్లెట్ తిన్న వారికి లక్షరూపాయల ప్రైజ్

బంపరాఫర్.. ఆమ్లెట్ తిన్న వారికి లక్షరూపాయల ప్రైజ్

దాదాపు ఆమ్లెట్ అంటే ఇష్టపడని వారుండరనే చెప్పాలి. ఇంతలా ఇష్టపడే ఆమ్లెట్ లక్ష రూపాయలను గెలుచుకునే అవకాశాన్ని కల్పిస్తోంది. ఎంచక్కా ఆమ్లెట్ తిని లక్ష రూపాయలను మీ సొంతం చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఓ స్ట్రీట్ ఫుడ్ వెండర్ కల్పిస్తున్నాడు. తాను వేసిన ఆమ్లెట్ తింటే లక్ష రూపాయలు అందిస్తానని కస్టమర్లకు ఛాలెంజ్ విసురుతున్నాడు. ఓ తెలుగు సినిమాలో 50 పరోటాలు తింటే 100 రూపాయలు ప్రైజ్, అలాగే తిన్న వాటికి బిల్ చెల్లించనక్కర్లేదంటూ హోటల్ యజమాని కస్టమర్లకు ఛాలెంజ్ విసురుతాడు. అదే మాదిరిగా ఇక్కడ కూడా ఆమ్లెట్స్ వేసే ఆ వ్యాపారి ఆమ్లెట్ తినండి.. లక్ష గెలుచుకోండి అంటూ సవాల్ విసురుతున్నాడు.

ఢిల్లీకి చెందిన ఓ స్ట్రీట్‌ ఫుడ్‌ వ్యాపారి కస్ట్‌మర్స్‌కి ఓ వెరైటీ ఛాలెంజ్‌ విసిరాడు. తాను వేసిన ఆమ్లెట్‌ తిన్నవారికి ఏకంగా లక్ష రూపాయల ప్రైజ్ ఇస్తానని ప్రకటించాడు. కానీ అక్కడే ఓ మెలిక ఉంది. అదేంటంటే అతడు ఏకంగా 31 గుడ్లతో ఆమ్లెట్ వేసి అది తిన్న వారికి లక్ష రూపాయలు ఇస్తానని వెల్లడించాడు. ఆమ్లెట్ తిని లక్ష గెలుచుకోవచ్చు అనుకునే వారికి ఈ సవాల్ కత్తి మీద సాములాంటిదే అని చెప్పాలి. సాధారణంగా గుడ్డు ఆరోగ్యానికి మంచిదే.. అలా అని పరిమితికి మించి తింటే అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సాధారణంగా ఒక మనిషి రోజుకి రెండు నుంచి మూడు గుడ్లు తింటాడు. మరీ గుడ్లంటే ఇష్టపడేవారు ఇంకో రెండు తినగలుగుతారు.

అదే ఫిట్ నెస్ కోసం వ్యాయామం చేసేవాళ్లయితే 10 గుడ్లు తినగలుగుతారు. మరి ఒక సాధారణ వ్యక్తి ఒకేసారి 31 గుడ్లు తినగలడా అంటూ కస్టమర్లు షాకవుతున్నారు. ఆ ఆమ్లెట్ ఏమో మనం ఇంట్లో వేసుకునే చిన్న ఆమ్లెట్‌ మాదిరి కాదాయే ఏకంగా 31 గుడ్లు ఉపయోగించి చేసిన భారీ బ్రెడ్ ఆమ్లెట్‌. ఈభారీ ఆమ్లెట్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది. ఇక ఇది చూసిన నెటిజన్లు ఈ వ్యాపారి తినిపించి మరీ చంపేసేలా ఉన్నాడే అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఒక వేళ ఆ ఆమ్లెట్ తిని లక్ష రూపాయలు గెలుచుకున్నా అవి హాస్పిటల్ బిల్స్ కే సరిపోవంటూ స్పందిస్తున్నారు.

Show comments