Arjun Suravaram
PM Kisan: దేశంలోని రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది. వీరికి ఇప్పటికే అనేక గుడ్ న్యూస్ లు చెప్పిన కేంద్రం..తాజాగా మరో శుభవార్త చెప్పింది.
PM Kisan: దేశంలోని రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించింది. వీరికి ఇప్పటికే అనేక గుడ్ న్యూస్ లు చెప్పిన కేంద్రం..తాజాగా మరో శుభవార్త చెప్పింది.
Arjun Suravaram
కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలక కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చింది. అలానే రైతుల సంక్షేమం కోసం కూడా పలు స్కీమ్స్ ను ప్రారంభించింది. అలాంటి వాటిల్లో పీఎం కిషాన్ సమ్మాన్ నిధి యోజన ఒకటి. దీని ద్వారా దేశంలోని కోట్లాది మంది రైతులు ప్రయోజనాలు పొందుతున్నారు. ఇదే సమయంలో రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెబుతుంది. ఇప్పటికే పలు మార్లు శుభవార్త చెప్పిన కేంద్రం తాజాగా మరో గుడ్ న్యూస్ చెప్పింది. పీఎం కిషాన్ సమ్మాన్ నిధి యోజన కింద 17వ విడత నిధులను జమ చేయనుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
దేశంలోని రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం పీఎం కిషాన్ సమ్మాన్ యోజన్ పథకాన్ని ప్రారంభించింది. దీనిని 2019లో ప్రధాని నరేంద్ర మోదీ యూపీలోని గోరఖ్ పూర్ లో ప్రారంభించి.. దేశ వ్యాప్తంగా అమలు చేస్తున్నారు. ఈ స్కీమ్ ద్వారా దేశంలోని కోట్లాది మంది ప్రయోజనాలను పొందుతున్నారు. ఈ పథకంలో రైతులకు రూ.6000 ఆర్థిక సహాయం అందజేస్తారు. ఏటా మూడు విడతలుగా 2000 రూపాయలను నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లకు బదిలీ చేస్తారు. ఇటీవల ఫిబ్రవరి 28న పీఎం కిషాన్ సమ్మాన్ పథకంకి సంబంధించిన 16వ విడత డబ్బులు జమ అయ్యాయి. ఇక 17వ విడత డబ్బుల కోసం కోట్లాది మంది రైతులు ఎదురు చూస్తున్నారు.
కొన్ని వర్గాల కథనం ప్రకారం.. తదుపరి విడత జూన్ మొదటి వారంలోనే విడుదల చేయనున్నారు. లోక్ సభ ఎన్నికల తరువాత ఈ నిధులు జమ చేయనున్నారు జూన్ 4 పార్లమెంట్ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఆ వెంటనే అదే వారంలో ఈ డబ్బులు జమ కానున్నాయని సమాచారం. వాస్తవానికి షెడ్యూల్ ప్రకారం జూన్ చివరి వారంలో ఈ డబ్బులు జమ కావాల్సి ఉంది. అయితే గడువు కంటే కాస్తా ముందుగునే ఈ డబ్బులు కాస్త రైతుల ఖాతాల్లో పడనున్నాయి. ఇదే సమయంలో ఈ కేవైసీ చేయని రైతులకు ఈ విడత సొమ్ము జమ కాదని తెలుస్తుంది. ఇంకా టైమ్ ఉంది కాబట్టి ఆలస్యం చేయకుండా వెంటనే ఈ కేవైసీ చేయించుకోవడం మంచిది. లేకపోతే, తదుపరి విడత డబ్బులు బ్లాక్ లో పెట్టే అవకాశం ఉంటుందని పలువురు నిపుణలు చెబుతున్నారు.
అంతేకాకుండా.. ఈ డబ్బుల కోసం ఏదైనా తప్పుడు సమాచారం ఇచ్చినట్లయితే, తదుపరి విడత డబ్బును నిలిపివేసే అవకాశం ఉంటుంది. మొత్తంగా రైతులకు డబ్బులు అందాయా లేదా అనేది తెలుసుకోవాలంటే pmkisan.gov.in అనే అధికారిక వెబ్‌సైట్ ను చూడాలి. ఆ తరువాత పీఎం కిషాన్ కింద లబ్ధిదారుల జాబితాపై క్లిక్ చేయాలి. అలా వారు ఇచ్చిన వాటిని పూర్తి, మీ సమాచారాన్ని నమోదు చేయండి. చివరగా ‘గెట్ రిపోర్ట్’ బటన్ పై క్లిక్ చేస్తే..రైతు స్టేటస్ తెలిసిపోతుంది. మరి.. రైతులకు అందిన ఈ గుడ్ న్యూస్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.