MLA kamleshwar dodiyar reaches Assembly on Bike: MLAగా గెలిచాడు.. కనీసం బైకు లేదు.. బంధువు బైక్ పై 330 కీ.మీలు ప్రయాణించి

MLAగా గెలిచాడు.. కనీసం బైకు లేదు.. బంధువు బైక్ పై 330 కీ.మీలు ప్రయాణించి

ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. కానీ కారు కాదు గదా.. కనీసం బైక్ కూడా లేదు. దీంతో ఆయన బంధువుల బైక్ పై ప్రయాణించి అసెంబ్లీకి వెళ్లారు.

ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందారు. కానీ కారు కాదు గదా.. కనీసం బైక్ కూడా లేదు. దీంతో ఆయన బంధువుల బైక్ పై ప్రయాణించి అసెంబ్లీకి వెళ్లారు.

ఇటీవల మధ్యప్రదేశ్ ఎన్నికలలో గెలిచిన ఓ ఎమ్మెల్యే.. తన గెలుపు ధ్రువీకరణ పత్రాలను ఇచ్చేందుకు.. ద్విచక్ర వాహనంపై ప్రయాణించి అసెంబ్లీకి చేరుకున్నాడు. దీనిలో ఆశ్చర్యం ఏం ఉంది అని అనుకుంటే పొరపాటే. ఎందుకంటే అతను ద్విచక్ర వాహనంపైన ప్రయాణించింది.. ఒకటి రెండు కిలోమీటర్లు కాదు ఏకంగా 300 కి.మీ. పైగా ఆ వాహనం కూడా తన బంధువుల వద్ద నుంచి తీసుకున్నదే. ఈరోజుల్లో దాదాపుగా అందరికి కార్స్ ఉంటున్నాయి. కనీసం ఒక సొంత బైక్ అయినా ఉంటుంది. కానీ ఎమ్మెల్యేగా గెలిచిన ఇతనికి ఏ సొంత వాహనం లేదు. దీనితో అతని బంధువు వద్ద నుండి బండి తీసుకుని దానికి ఎమ్మెల్యే స్టికర్ అతికించి.. ఎముకలు కొరికే చలిలో ప్రయాణించి అసెంబ్లీకి చేరుకున్నాడు. ఆ వ్యక్తి పేరు ‘కమలేశ్వర్ దోడియార్’ . ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

మధ్యప్రదేశ్ లోని రత్లాం జిల్లా సైలాన్ నియోజక వర్గం నుంచి.. భారతీయ ఆదివాసీ పార్టీ తరపున ‘కమలేశ్వర్ దోడియార్’ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఆ పార్టీ నుంచి విజయం సాధించింది కేవలం ఇతనొక్కరే. అతను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తన గెలుపు ధ్రువీకరణ పత్రాలను అసెంబ్లీలో అందజేయాలి. దీనికోసం అతను తన నియోజక వర్గం నుంచి భోపాల్ వరకు బైక్ పైన తన ప్రయాణాన్ని సాగించాడు. దీనిని సోషల్ మీడియాలో లైవ్ ఇచ్చారు. ఎమ్మెల్యే అయిన తర్వాత తొలిసారి పర్యటనకు వెళ్లేందుకు కార్ ఏర్పాటు చేయాలనీ ప్రయత్నం చేసిన అది సాధ్యపడలేదన్నారు. తనకి సొంత వాహనం కొనుగోలు చేసే స్థోమత లేదని, తన బంధువు వాహనం తీసుకుని వచ్చానని ఆయన చెప్పుకొచ్చారు.

చివరికి బుధవారం రాత్రి బైక్ మీదనే భోపాల్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెల్యే విశ్రాంతి గృహంలో అతిధిగా బస చేశారు. గురువారం రోజున అధికారులకు తన పత్రాలను అందచేశారు. ఈ విషయాన్నీ కమలేశ్వర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ప్రధాని మోడీ, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రత్లాం పోలీసులను ట్యాగ్ చేశారు. ‘దారిలో ఎటువంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా అవసరమైన భద్రత కల్పించాలి’ అని కోరారు.

కాగా, కమలేశ్వర్‌ ఒక నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇతను ఢిల్లీ యూనివర్సిటీ నుంచి లా విద్యను పూర్తి చేసుకున్నారు. భారతీయ ఆదివాసీ పార్టీ తరపున పోటీ చేసి.. కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్ష్ విజయ్ గెహ్లాట్‌పై విజయం సాధించారు. ఈ పార్టీ తరపున పోటీ చేసిన వారిలో కమలేశ్వర్‌ మాత్రమే గెలుపొందడం విశేషం. ఇతను ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా ప్రజలు ఆర్థిక సహాయం చేసారని కమలేశ్వర్‌ వెల్లడించారు. ఏదేమైనా ‘కమలేశ్వర్ దోడియార్’ నిరుపేద నుంచి ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడిగా అందరికి ఆదర్శంగా నిలిచారు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments