Ayodhya Ram Mandir: జనవరి 22న ఉద్యోగులకు సెలవు ప్రకటించిన ముఖేష్ అంబానీ

అయోధ్య భక్తులకు శుభవార్త.. దర్శనంతో పాటు అన్నపానీయాలు ఉచితమే..!

ఈ నెల 22న యావత్ భారతావని పులకించిపోయేందుకు సిద్ధమైంది. అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన చోటుచేసుకుంది. ఈ వేడుకను తిలకించేందుకు వేల మంది భక్తులు అక్కడకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో..

ఈ నెల 22న యావత్ భారతావని పులకించిపోయేందుకు సిద్ధమైంది. అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన చోటుచేసుకుంది. ఈ వేడుకను తిలకించేందుకు వేల మంది భక్తులు అక్కడకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో..

‘అంతా రామమయం.. ఈ జగమంతా రామమయం.. అంతా రామమయం’ ప్రస్తుతం భారతీయుల పరిస్థితి ఇది. ఎందుకంటే ఎన్నో ఏళ్ల కల నెరవేరే సమయం ఆసన్నమైంది. ఎన్నో శతాబ్దాలుగా ఎదురు చూస్తున్నరోజు రానే వచ్చేసింది. జనవరి 22న ఉత్తరప్రదేశ్ అయోధ్యలోని రామాలయంలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన జరగనుంది. ఈ వేడుకను ఓ పండుగలా చేసుకుంటున్నారు ఇండియన్స్. ఇప్పటి ఈ వేడుకకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్ లల్లాను దర్శించుకునేందుకు వేలాది మంది హిందూ భక్తులే కాకుండా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనుంది. అలాగే  కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా జరిగాయి.

ఇప్పటికే సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార రంగాల్లోని ప్రముఖులకు ఆహ్వానాలు అందాయి. అలాగే శ్రీరామున్ని కనులారా వీక్షించేందుకు దేశ నలుములలా నుండి భక్తులు బయలు దేరారు. ఈ నిమిత్తం ఇండియన్ రైల్వే కూడా ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. ఇదిలా ఉంటే.. ఈ వేడుకతో అయోధ్యలో భక్తుల తాకిడి విపరీతంగా పెరిగింది. కాగా, భక్తులు వేలల్లో వస్తున్న నేపథ్యంలో ట్రస్టు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులు వ్యయ ప్రయాసాలు కూర్చుకుని ఇక్కడకు వస్తున్న నేపథ్యంలో వారిపై మరింత భారం మోపకూడదన్న ఉద్దేశంతో.. దర్శన రుసుమును క్యాన్సిల్ చేసింది. ఎలాంటి రుసుము లేకుండానే ఉచితంగా దర్శనం కల్పించే ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. అలాగే ప్రసాదాన్ని ఉచితంగా ఇవ్వాలని భావిస్తున్నారు. ఈ నిర్మాణం ప్రారంభం కాక ముందే 1500 నుండి 2000 మంది వరకు వచ్చేవారు.

కానీ ఇప్పుడు నిత్యం 40 వేల నుండి 50 వేల వరకు వస్తున్నారు. ఈ గుడి ప్రారంభం అయ్యాక.. లక్ష వరకు సందర్శించుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. వీరందరికీ కూడా ఉచితంగానే దర్శనం కల్పించాలని భావిస్తున్నారు. అలాగే ఇక్కడకు వచ్చే రామ భక్తులకు అల్పాహారాలు, భోజనం, టీ, మంచి నీళ్లు కూడా ఉచితంగా అందించనున్నారు. దీని కోసం కొన్ని ధార్మిక సంస్థలు ముందుకు వచ్చాయి. నిహాంగ్ సింగ్స్, ఇస్కాన్ ఈ ఏర్పాట్లను చేస్తోంది. ఇప్పటికే వంటశాలలను సిద్ధం చేసుకుంది. రాం కీ రసోయ్ నుండి అనేక ప్రాంతాల్లో వంట శాలలను ఏర్పాటు చేశాయి. అయోధ్యలోని ప్రతి వీధిలో ఆహారాన్ని ఏర్పాటు చేయనున్నారు. కిచిడి, ఆలూ పూరీ, కధీ చావల్, ఆచార్, పాపడ్స్ అందిచనున్నారు. అలాగే చలికాలం నిమిత్తం టీ కూడా భక్తులకు ఇవ్వనున్నారు. ఏ భక్తులు ఆహారానికి ఇబ్బంది పడకుండా తగు జాగ్రత్తలు, ఏర్పాట్లు చేస్తున్నాయి ధార్మిక సంస్థలు. మరీ అయోధ్యకు వెళ్లాలనుకుంటున్నారా.. అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments