Venkateswarlu
Venkateswarlu
భారత సంస్కృతి, సంప్రదాయాలకు విదేశాల్లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచ వివాహ వ్యవస్థలో ప్రత్యేకమైన స్థానం ఉంది. అందుకే భారతీయ యువతీ, యువకులతో ప్రేమ, పెళ్లి బంధాలను ఏర్పరచుకోవటానికి విదేశీయులు తెగ ఇష్టం చూపుతుంటారు. అగ్ర దేశాలతో పాటు మిగిలిన దేశాల్లోని యువతీ, యువకులు భారతీయలతో సంబంధాలు కలుపుకోవటానికి చూస్తుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో విదేశీ యువతులు భారతీయ యువకులపై తెగ ఇష్టం పెంచుకుంటున్నారట.
విదేశాల్లో భారతీయ యువకులకు డిమాండ్ బాగా పెరిగిపోయిందట. అందుకే, భారతీయ యువకులు విదేశీ యువతుల్ని పెళ్లి చేసుకుంటున్న సంఘటనలు ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయాయి. పెళ్లి చేసుకున్న తర్వాత ఇండియాలోనే ఉండిపోవటానికి ఆ విదేశీ యువతులు ఆసక్తి చూపటం విశేషం. తాజాగా, నిర్మల్ జిల్లాలో విదేశీ యువతీ, తెలుగు యువకుడికి మధ్య ప్రేమ పెళ్లి జరిగింది. ఆ వివరాల్లోకి వెళితే.. నిర్మల్ జిల్లాలోని శాస్త్రి నగర్ కాలనీకి చెందిన సదానందం, పద్మ దంపతుల కుమారుడు కార్తీక్ ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు.
అక్కడ హనాతో అతడికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. చదువు తర్వాత ఇద్దరూ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. కార్తీక్ సాఫ్ట్‌వేర్‌లో చేరగా.. హనా సైంటిస్టుగా పని చేస్తోంది. కొన్నేళ్లు ప్రేమించుకున్న తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. పెద్దలకు ఈ విషయం చెప్పగా.. సరేనన్నారు. ఈ నెల 22న నిర్మల్ జిల్లా కేంద్రంలోని సిటీ ఫంక్షన్ హాల్లో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. ప్రస్తుతం వీరి పెళ్లి రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఓ న్యూస్‌గా మారింది. మరి, విదేశీ యువతి హనా తెలుగబ్బాయిని పెళ్లాడి.. తెలుగింటి కోడలు అవ్వటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.