Chennai Metro: మెట్రో బంపర్ ఆఫర్.. రూ.100తో అపరిమిత ప్రయాణం..!

మెట్రో బంపర్ ఆఫర్.. రూ.100తో అపరిమిత ప్రయాణం..!

Chennai Metro: మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో జర్నీ టైమ్ ఆదాయ అవుతోంది. అంతేకాక ట్రాఫిక్ సమస్యలు, ఆ సౌండ్ పొల్యూషన్ ఇతర సమస్యలు చాలా వరకు తగ్గాయి. మెట్రో రైళ్లు సంస్థలు  వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.

Chennai Metro: మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో జర్నీ టైమ్ ఆదాయ అవుతోంది. అంతేకాక ట్రాఫిక్ సమస్యలు, ఆ సౌండ్ పొల్యూషన్ ఇతర సమస్యలు చాలా వరకు తగ్గాయి. మెట్రో రైళ్లు సంస్థలు  వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి.

ప్రస్తుతం దేశంలోని అన్ని ప్రధాన నగరాల్లో మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, ముంబై, కలకత్తా వంటి నగరాల్లో మెట్రో రైళ్ల సర్వీస్ లు అందుబాటులో ఉన్నాయి. ఇక మెట్రో సేవలు అందుబాటులోకి రావడంతో నగరాల్లోని ప్రజలకు ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి. ఇలానే మెట్రోకు అన్ని ప్రధాన నగరాల్లో మంచి డిమాండ్ ఉంది. ఇక ప్రజల నుంచి వస్తున్న ఆదరణతో వివిధ నగరాల్లోనే మెట్రో సంస్థలు కూడా అనేక సదుపాయాలను కల్పిస్తున్నాయి. అలానే తాజాగా మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే గుడ్ న్యూస్ ఒకటి వచ్చింది. రూ.100తోనే అపరిమిత జర్నీ చేయవచ్చు. మరి..ఈ బంపర్ ఆఫర్ ఎక్కడ, ఏమిటి?. పూర్తి వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

మెట్రో రైళ్లు అందుబాటులోకి రావడంతో జర్నీ టైమ్ ఆదాయ అవుతోంది. అంతేకాక ట్రాఫిక్ సమస్యలు, ఆ సౌండ్ పొల్యూషన్ ఇతర సమస్యలు చాలా వరకు తగ్గాయి. అతి తక్కువ సమయంలోనే నగరంలోని ఒక చివరి నుంచి మరో చివరికి చేరుకుంటారు. అలానే ఈ మెట్రో సర్వీస్ అనేది ఉద్యోగులకు, మహిళలకు ఎంతో ఉపయోగకరంగా ఉంది. ప్రస్తుతం అన్ని నగరాల్లో ఈ మెట్రో రైళ్లు పరుగులు పెడుతున్నాయి. అంతేకాక  పలు నగరాల్లో మెట్రో రైళ్లు సంస్థలు  వివిధ రకాల ఆఫర్లు ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకట్టుకుంటున్నాయి. హైదరాబాద్ మెట్రో రైళ్లో శని, ఆదివారం రూ.59 ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

అలానే తాజాగా తమిళనాడు రాజధాని చెన్నై లో కూడా ఇక్కడ మెట్రో రైల్ లిమిటెడ్ కూడా వినూత్న ఆఫర్  తీసుకొచ్చింది. పర్యాటకలు, వారాంతాల్లో షాపింగ్‌లకు వెళ్లాలనుకునే వారికోసం ‘వన్‌ డే టూరిస్ట్‌ కార్డ్‌’ పేరుతో కొత్త స్కీమ్ కి శనివారం శ్రీకారం చుట్టింది. రూ.100లతో ఎన్నిసార్లైనా తిరిగే ప్రయాణించే వీలుంటుందని తెలిపింది. అయితే ఇది కేవలం వారంతపు రోజుల్లో మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక ఈ కార్డును పొందే విషయానికి వస్తే.. రూ.150 చెల్లిస్తే.. కార్డును పొందవచ్చు. ఇక్కడ రూ.100 అని చెప్పి..150 తీసుకోవడం ఏమిటనే సందేహం రావచ్చు. అందులో 50 రూపాయలు డిపాజిట్ గా తీసుకుంటారు.

తిరిగి కార్డును ఇచ్చేటప్పుడు..వారు డిపాజిట్ చేసుకున్న సొమ్మును తిరిగి చెల్లిస్తారు. ఇలా చెన్నై మెట్రో రైల్ లిమిటెడ్ కొత్త స్కీమ్ ప్రారంభించడానికి ఓ కారణం ఉందని టాక్ వినిపిస్తోంది. మార్చితో పోల్చితే చెన్నై మెట్రోలో ప్రయాణికుల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రయాణికులను ఆకర్షించేందుకు ఈ కొత్త స్కీమ్ ను సీఎంఆర్‌ఎల్‌ ప్రవేశపెట్టింది. చెన్నై సిటీ పరిధిలోని విమానాశ్రయం చెన్నై సెంట్రల్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే వాహనదారులకు చుక్కలు కనిపిస్తాయి. రద్దీ సమయాల్లో వాహనాలు  కొంచెం కొంచెం మాత్రమే కదులుతాయి. మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత నగర వాసులకు ట్రాపిక్ కష్టాలు తీరాయి.

Show comments