దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కి భారతరత్న!

భారత దేశంలో అత్యున్నత పురస్కాల్లో ఒకటి భారత రత్న. ఏడాదికి ముగ్గురికి మాత్రమే ఈ పురస్కాారాన్ని ప్రకటిస్తారు. ప్రజా సేవలో ఎనలేని కృషి చేసిన వారికి భారత రత్న ప్రకటిస్తుంటారు.

భారత దేశంలో అత్యున్నత పురస్కాల్లో ఒకటి భారత రత్న. ఏడాదికి ముగ్గురికి మాత్రమే ఈ పురస్కాారాన్ని ప్రకటిస్తారు. ప్రజా సేవలో ఎనలేని కృషి చేసిన వారికి భారత రత్న ప్రకటిస్తుంటారు.

భారత దేశంలో అత్యున్నత పురస్కారాల్లో ఒకటి భారత రత్న. దీనిని 1954 లో ప్రవేశ పెట్టారు.. భారత రత్న పురస్కారం అసాధారణ ప్రజా సేవలకు, సాహిత్య, కళా, క్రీడా రంగాల్లో సేవల ఎనలేని సేవలు చేసిన వారికి ప్రధానం చేయబడుతుంది. ఏడాదిలో మూడు భారత రత్న అవార్డులు మాత్రమే ప్రధానం చేస్తుంటారు. అవార్డు గ్రహీతకు రాష్ట్రపతి సంతంక చేసిన సర్టిఫికెట్ తో పాటు పతకం అందించబడతాయి. దేశంలో భారతరత్న అవార్డను 48 మంది స్వీకరించారు. వారిలో 16 మందికి మరణాంతరం ప్రభానం చేశారు. ఈ అవార్డులు వారు సమాజానికి చేసిన కృషిని ప్రాధాన్యతగా తీసుకొని ఇవ్వడం జరిగింది. తాజాగా బీహార్ మాజీ ముఖ్యమంత్రికి భారతరత్న అవార్డు ప్రకటించింది భారత ప్రభుత్వం. పూర్తి వివరాల్లోకి వెళితే..

పలు సేవారంగాల్లో ఎనలేని కృషి చేసిన వారికి ప్రభుత్వం భారతరత్న అవార్డుతో పురస్కరిస్తుంది భారత ప్రభుత్వం. తాజాగా బీహార్ దివంగత మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్‌కి కు కేంద్ర ప్రభుత్వం భారత రత్న అవార్డు ప్రకటించింది. సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతి దళ్ పార్టీ తరుపు నుంచి రెండు పర్యాయాలు 1977 నుంచి 1979 వరకు ఆయన బీహార్ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం విశేషంగా కృషి చేశారు ఠాకూర్. ఆయన శత జయంతి సందర్భంగా కర్పూరి ఠాకూర్ అందించిన సేవలకు గాను భారత ప్రభుత్వం ఆయనకు ‘భారత రత్న’ అవార్డు ప్రకటించారు.

జాతీయ ఉద్యమంలో ఆయన క్రీయాశీలకంగా పాల్గొని ఎంతోమందిన ఉత్తేజపరిచారు. ఓబీసీ నాయకుడిగా పేద ప్రజల కోసం చేసిన పోరాటాలకు జనమంతా ఆయనను ‘జన నాయక్’ అని పిలుచుకునేవారు. కర్పూరి ఠాకూర్ బీహార్ లోని సమస్తిపూర్ లో జన్మించారు. క్విట్ ఇండియా ఉద్యమంలో జైలు కు వెళ్లారు. 1952 లో జరిగిన ఎన్నికల్లో తొలిసారిగా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. మరణాంతరం ఆయనకు భారత రత్న వరించడంపై పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Show comments