P Krishna
Largest Lock Reached Ayodhya: దేశం మొత్తం ఇప్పుడు ఎవరి నోట విన్నా అయ్యోధ్య రామమందిరం మాటే వినిపిస్తుంది. జనవరి 22 న అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ క్రమంలోనే అయోధ్యకు దేశం నలమూలల నుంచి కానులకల వెల్లువ కొనసాగుతుంది.
Largest Lock Reached Ayodhya: దేశం మొత్తం ఇప్పుడు ఎవరి నోట విన్నా అయ్యోధ్య రామమందిరం మాటే వినిపిస్తుంది. జనవరి 22 న అయోధ్యలో ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ క్రమంలోనే అయోధ్యకు దేశం నలమూలల నుంచి కానులకల వెల్లువ కొనసాగుతుంది.
P Krishna
దేశం మొత్తం ఇప్పుడు రామనామ జపం చేస్తుంది. అందరూ అయ్యోధ్యవైపే చూస్తున్నారు. అయోధ్యలో రామ మందిరం ప్రారంభోత్సవానికి సర్వం సిద్దం అయ్యింది. ఈ నెల 22న శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఇందుకోసం రాజకీయ, సినీ, క్రీడా, వ్యాపార రంగానికి చెందిన దిగ్గజాలకు ఇప్పటికే ఆహ్వానాలు పంపారు. అంతేకాదు ఎంతో ప్రతిష్టాత్మకంగా జరగబోయే ఈ వేడుకకు దేశం నలుమూలల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఎన్నో ప్రత్యేక కానుక అయోధ్య రామమందిరం చేరుకున్న విషయం తెలిసందే. తాజాగా ప్రపంచంలోనే అతి పెద్ద తాళం అయోధ్యకు చేరుకుంది.. దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. వివరాల్లోకి వెళితే..
అయోధ్యలో రామమందిరం ప్రతిష్టాపనకు ముహూర్తం దగ్గరపడుతుంది. ఈ క్రమంలోనే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి అయోధ్యకు కనీ వినీ ఎరుగని రీతిలో కానుకలు వచ్చి చేరుతున్నాయి. 108 అడుగుల అగరుబత్తి, 2,100 కిలోల అతి పెద్ద గంట, 1,100 కిలోల భారీ దీపం, ఏక కాలంలో 8 దేశాల సమయాన్ని సూచించే ప్రత్యేక గడియారం, అమరావతి నుంచి 500 కిలోల కుంకుమ, ఢిల్లీ నుంచి రామాయాల్లో సేకరించిన ధాన్యం ట్రస్టుకు అందాయి. అంతేకాదు సీతమ్మ జన్మస్థలం అయిన నేపాల్ లోని జనక్ పూర్ ధామ్ నుంచి వెండి పాదరక్షలు, ఆభరణాలు, వస్త్రాలతో పాటుగా మూడు వేలకు పైగా బహుమతులు వచ్చాయి. ఈ క్రమంలోనే అయోధ్యకు ప్రపంచంలోనే అతి పెద్ద తాళం వచ్చి చేరింది.
ఉత్తర్ ప్రదేశ్ లోని అలీగఢ్ కు చెందిన ప్రముఖ తాళాల తయారుదారుడు సత్య ప్రకాశ్ శర్మ ఆయన సతీమణి రుక్మణి దేవి శర్మ స్వచ్ఛందంగా ఎంతో కష్టపడి ఈ బాహుబలి తాళం తయారు చేశారు. ఈ తాళం మొత్తం బరువు 400 కిలోలు, దాని కీ బరువు 30 కిలోలు అని తెలిపారు. ఈ తాళం తయారు చేయడానికి సుమారు రూ.2 లక్షలు ఖర్చు అయ్యింది. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి తమ వంతు సేవలో భాగంగా ఈ అతి పెద్ద తాళం సమర్పించడం తమకు ఎంతో సంతృప్తినిచ్చిందని దంపతులు తెలిపారు. ఈ తాళం తయారీకి ఆరు నెలల సమయం పట్టిందని, తాళం పొడవు 10 అడుగులు, 4.5 అడుగుల వెడల్పు, మందం 9.5 అంగుళాలు ఉంటుందని తెలిపారు. ప్రస్తుతం ఈ తాళం ఆటోలో అయోధ్యకు తరలిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విషయంపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.