Ayodhya Ram Mandir: అయోధ్య మందిరం కోసం 2500 కోట్ల విరాళాలు.. ఎవరు ఎక్కువ ఇచ్చారంటే?

అయోధ్య మందిరం కోసం 2500 కోట్ల విరాళాలు.. ఎవరు ఎక్కువ ఇచ్చారంటే?

Ayodhya Ram Mandir.. చారిత్రాత్మక ఘట్టం.. నేడు చరిత్రలో నిలిచిపోయే వేడుక కానుంది. ఎన్నో శతాబ్దాలుగా దేని కోసమేతే యుద్దాలు, పోరాటాలు జరిగాయో.. ఇప్పుడు రామాలయ నిర్మాణంతో సఫలీకృతమైంది. అయోధ్యలో జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతుంది.

Ayodhya Ram Mandir.. చారిత్రాత్మక ఘట్టం.. నేడు చరిత్రలో నిలిచిపోయే వేడుక కానుంది. ఎన్నో శతాబ్దాలుగా దేని కోసమేతే యుద్దాలు, పోరాటాలు జరిగాయో.. ఇప్పుడు రామాలయ నిర్మాణంతో సఫలీకృతమైంది. అయోధ్యలో జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగిపోతుంది.

అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుని శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట జరగబోతుంది. భారత్ దేశంలో యావత్ ప్రజానీకం.. ఈ వేడుక కోసం వెయ్యి కళ్లతో కొన్ని దశాబ్దాలుగా ఎదురు చూస్తున్నారు. ఆ ఉద్వేగపూరిత సమయం వచ్చేసింది. కోట్లాది మంది హిందువుల ఆకాంక్షలు, ఆశలకు తెరలేపింది అయోధ్యలోని రామ మందిరం. జనవరి 22న ప్రధాని మోడీ చేతుల మీదుగా శ్రీరామ్ లల్లా ప్రతిష్టాపన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాయి. అయోధ్య-బాబ్రీ మసీదు వివాదం కేసు తీర్పు వెలువడిన ఇన్నాళ్లకు అయోధ్యలో రామాలయ నిర్మాణం పూర్తి చేసుకుంది. అయితే ఈ నిర్మాణానికి కేంద్రం నుండి రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎలాంటి ఫండ్స్ ఇవ్వలేదు.

ఇది కేవలం ప్రజల నుండి సేకరించిన డబ్బుతోనే నిర్మాణం జరిగింది. ఏడు దశాబ్దాల వివాదాన్ని, ఓ సున్నితమైన అంశాన్ని ఓ కొలిక్కి తెచ్చిన సుప్రీం కోర్టు.. 2019లో అయోధ్య.. హిందువులదే అని తేల్చి చెప్పింది. వివాదాస్పద 2.77 ఎకరాల భూమి రామ మందిర నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ట్రస్టుకు బదలాయించాలని జస్టిస్ రంగన్ గోగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు నిచ్చింది. ఇక రామ మందిర నిర్మాణానికి అడుగులు పడ్డాయి. అయితే దీనికి భారీగా ఖర్చు అవుతుందని భావించి రామ జన్మ భూమి క్షేత్ర ట్రస్ట్ విరాళాలను సేకరించడం మొదలు పెట్టింది. అందుకు టార్గెట్ పీరియడ్ నిర్ణయించింది.

శ్రీరాముని మందిర నిర్మాణం కోసం 2021 జనవరి 14వ తేదీన విరాళాల కార్యక్రమం చేపట్టి కేవలం 45 రోజుల పాటు మాత్రమే వాటిని సేకరించింది. అదే ఏడాది ఫిబ్రవరి 27న విరాళాల సేకరణ నిలిపి వేసింది. మొత్తంగా రూ. 2500 కోట్ల రూపాయల విరాళాలు అందాయి. రూ. 10 కోట్ల మందికి పైగా విరాళాలు అందించారు. వీరిలో ఏ రాష్ట్రం నుండి ఎంత అందాయో తెలుసా.. ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్ రూ. 20 కోట్లు, మేఘాలయ రూ. 8.5 కోట్లు, అరుణాచల్ ప్రదేశ్ నుండి రూ. 4.5 కోట్లు, నాగాలాండ్ రూ. 2.8 కోట్లు, మిజోరాం రూ. 2.1 కోట్లు అందించాయి. ఇక తమిళనాడు నుండి రూ. 85 కోట్లు, కేరళ నుండి రూ. 13 కోట్లు వచ్చాయని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర (ట్రస్ట్) ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ వెల్లడించారు.

మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రూ. 5, 00, 100 అందించారు. అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు కూడా తమకు నచ్చిన నగదును విరాళంగా ఇచ్చారు. అయితే వ్యక్తిగతంగా చూస్తే.. గుజరాత్ కు చెందిన ఆథ్యాత్మిక నేత మొరారీ బాపు రూ. 11.3 కోట్ల రూపాయలను అందజేశారు. అంతేనా.. బ్రిటన్, కెనడా దేశాల నుండి విరాళాలు వచ్చాయి. రూ. 8 కోట్లు వసూలు అయ్యాయి. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విరాళాలను ఏకకాలంలో సేకరించారు. 9 లక్షల మంది కార్యకర్తలు 1,75,000 బృందాలుగా విడిపోయి ఇంటింటికి వెళ్లి ఈ నగదును సేకరించారు. ఇప్పటి వరకు రూ. 1800 కోట్లు ఖర్చు చేశారు. ఈ విరాళాల్లో మీ వంతు ఉందా.. అయితే ఓ కామెంట్ చేయండి.

Show comments