వీడియో: విజయ్‌ దేవరకొండ మైక్‌ అలా ఎందుకు పట్టుకుంటాడు? చిన్నారి ప్రశ్నకి హీరో రిప్లయ్!

Vijay Devarakonda: టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండది ప్రత్యేకమైన స్టైల్‌. డ్రెస్సింగ్‌ నుంచి సినిమా ప్రమోషన్స్‌ వరకు ప్రతి దాన్ని భిన్నంగా ప్లాన్‌ చేస్తాడు. అలానే మైక్‌ కూడా కిందకు వంచి పట్టుకుంటాడు. మరి రౌడీ హీరో అలా ఎందుకు చేస్తాడో చెప్పుకొచ్చింది ఓ చిన్నారి. ఆ వివరాలు.

Vijay Devarakonda: టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండది ప్రత్యేకమైన స్టైల్‌. డ్రెస్సింగ్‌ నుంచి సినిమా ప్రమోషన్స్‌ వరకు ప్రతి దాన్ని భిన్నంగా ప్లాన్‌ చేస్తాడు. అలానే మైక్‌ కూడా కిందకు వంచి పట్టుకుంటాడు. మరి రౌడీ హీరో అలా ఎందుకు చేస్తాడో చెప్పుకొచ్చింది ఓ చిన్నారి. ఆ వివరాలు.

విజయ్‌ దేవరకొండ.. టాలీవుడ్‌లో ఈ హీరోది ప్రత్యేక ప్రస్థానం. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్‌ లేకుండా.. చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. ఇప్పుడు క్రేజీ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపులు సినిమాతో తొలిసారి హీరోగా మారాడు విజయ్‌ దేవరకొండ. ఆ తర్వాత అతడు నటించిన అర్జున్‌ రెడ్డి.. విజయ్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది. ఇదలా ఉంచితే.. సినిమాలతో సంబంధం లేకుండా వార్తల్లో నిలవడం విజయ్‌ దేవరకొండకే చెల్లింది. అతడికి ఎంత క్రేజ్‌ ఉందో.. అదే స్థాయిలో ట్రోల్‌ చేస్తుంటారు. ఇక తాజాగా కల్కి చిత్రంలో విజయ్‌ దేవరకొండ అర్జునుడి పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. చాలా మంది దీనిపై విమర్శలు చేస్తున్నారు. ఆ పాత్రకు అతడు అస్సలు సెట్‌ కాలేదని కామెంట్స్‌ చేశారు. కానీ విజయ్‌ మాత్రం వాటిని పట్టించుకోలేదు.

ఇక సినిమాలు, వివాదాల సంగతి అలా ఉంచితే.. తాజాగా విజయ్‌ దేవరకొండ మరోసారి వార్తల్లో నిలిచాడు. ఇన్‌స్టాలో వైరల్‌ అవుతోన్న ఓ రీల్‌ మీద స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్స్‌ చేశాడు విజయ్‌ దేవరకొండ. ప్రస్తుతం ఈ రీల్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇంతకు ఆ రీల్‌ ఏంటి.. దానిపై విజయ్‌ దేవరకొండ ఎందుకు స్పందించాడు అంటే..

స్టోరీస్‌బైటూప్లస్‌వన అనే ఇన్‌స్టా పేజీలో పోస్ట్‌ చేసిన ఓ వీడియో తెగ వైరల్‌ అవుతోంది. ఆర్య అనే బుడ్డది విజయ్‌ దేవరకొండకు సంబంధించిన ఓ సీక్రెట్‌ని వెల్లడించింది. ఈ వీడియలో ఆర్య అనే చిన్నారి మాట్లాడుతూ.. అందరూ మైక్‌ ఇలా పట్టుకుంటే.. విజయ్‌ దేవరకొండ మాత్రం ఎందుకు ఇలా కిందకు పెట్టి పట్టుకుంటాడు అని వాళ్ల నాన్నని ప్రశ్నిస్తుంది. అందుకు ఆ పాప తండ్రి ఏమో .. నాకు తెలీదు తల్లి అంటాడు.

అప్పుడు ఆ బుడ్డది ఎందుకంటే విజయ్‌ దేవరకొండకు బిర్యానీ అంటే ఇష్టం.. అందుకే మైక్‌ను ఇలా సైడ్‌కి కిందికి వంచి పట్టుకుంటాడు అన్నది. బిర్యాని ఇష్టమైతే మైక్‌ని అలా పట్టుకుంటారా అని వాళ్ల నాన్న అడిగితే.. అవును.. లెగ్‌ పీస్‌ను ఇలానే పట్టుకుని తింటాం. అందుకే విజయ్‌దేవరకొండ మైక్‌ని అలానే పట్టుకుంటాడు అని చెప్పుకొచ్చింది. ఆ బుడ్డది చెప్పిన దానికి అందరూ పడి పడి నవ్వుతున్నారు.

ఇక ఈ రీల్‌పై విజయ్‌దేవరకొండ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. నిజమే నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం ఆర్య. ఇక నేను ఎందుకు మైక్‌ అలా పట్టుకుంటానే నాక్కూడా తెలియదు. నాకు అడ్డు రాకుండా కంఫర్ట్‌బుల్‌గా ఉండటం కోసం అలా పట్టుకుంటానేమో. నువ్వు చెప్పిన ఆన్సర్‌ నాకు బాగా నచ్చింది.. లవ్‌ యూ అంటూ కామెంట్స్‌ చేశాడు. వీరిద్దరి కన్వర్జేషన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Show comments