Guntur Kaaram: గుంటూరు కారం నుండి మాస్ అప్డేట్.. మిర్చి వ్యాపారి వెంకటరమణ!

గుంటూరు కారం నుండి మాస్ అప్డేట్.. మిర్చి వ్యాపారి వెంకటరమణ!

సంక్రాంతి పండగ అంటేనే సరదా. అల్లుళ్లు, బంధువులు, చుట్టాల రాకతో సందడి నెలకొంటుంది. అలాగే కోడి పందాలు, ఇంటిల్లి పాది సినిమాలు చూడటం ఈ పండుగలో భాగమే. ఈ ఏడాది సంక్రాంతికి కూడా అలరించేందుకు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వాటిల్లో ఒకటి గుంటూరు కారం కూడా ఉంది.

సంక్రాంతి పండగ అంటేనే సరదా. అల్లుళ్లు, బంధువులు, చుట్టాల రాకతో సందడి నెలకొంటుంది. అలాగే కోడి పందాలు, ఇంటిల్లి పాది సినిమాలు చూడటం ఈ పండుగలో భాగమే. ఈ ఏడాది సంక్రాంతికి కూడా అలరించేందుకు పెద్ద సినిమాలు రాబోతున్నాయి. వాటిల్లో ఒకటి గుంటూరు కారం కూడా ఉంది.

సంక్రాంతి బరిలో విడుదల కాబోతున్న సినిమాల్లో ఒకటి మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం. ఆది నుండి అడుగడునా అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ మూవీ అన్ని అవరోధాలను దాటుకుని పెద్ద పండుగకు రావడం పక్కా ఫిక్స్ అని తేల్చేశాడు నిర్మాత నాగవంశీ. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రం జనవరి 12న థియేటర్లలోకి రాబోతుంది. మహేష్-త్రివిక్రమ్ కాంబోలో రాబోతున్న మూడవ పిక్చర్ ఇది. అతడు బాక్సాఫీసు వద్ద భారీ హిట్ కొట్టగా.. ఖలేజా బోల్తా కొట్టింది. 13 ఏళ్ల తర్వాత వీరి కాంబోలో మూవీ వస్తుంది అనగానే సూపర్ స్టార్ అభిమానులు ఎంతో సంతోషంలో మునిగితేలిపోయారు. ఆ రేంజ్‌లోనే ఎక్స్ పెర్టేషన్స్ ఉన్నాయి.

మసాలా సాంగ్, ఇప్పుడొచ్చినా మాస్ సాంగ్ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశాయి. అయితే ఇప్పుడొక ఇంట్రస్టింగ్ న్యూస్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఈ చిత్రంలో మహేష్.. గుంటూరు జిల్లా వాసిగా కనిపించడమే కాకుండా.. అక్కడి ఫేమస్ పంట అయిన మిర్చి వ్యాపారిగా కనిపించబోతున్నాడట. అతడి పేరు వెంకట రమణా రెడ్డి అని.. ముద్దుగా రవణ అని పిలుస్తారని తెలుస్తోంది. నలుగురికి సాయం చేయడమే కాకుండా.. కాస్త తేడా వస్తే తాట తీసేస్తాడట. అలాగే ఫ్యామిలీ సెంటిమెంట్ పుష్కలంగా ఉంటుందట. ఈ మూవీలో ఊరమాస్ ఫైట్లు ఉండబోతున్నాయని సమాచారం. ముఖ్యంగా జగపతి బాబు, మహేష్ మధ్య హోరాహోరీ ఫైట్ సీక్వెన్స్ ఉండబోతుందట.

ఇక ప్రకాష్ రాజ్, రమ్య కృష్ణ, బ్రహ్మనందం వంటి దిగ్గజ నటులు కనిపించబోతున్నారు ఈ చిత్రంలో. అయితే ఈ సినిమా విడుదల దగ్గరపడుతున్న కొద్దీ అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఈ సినిమాకు భారీ స్థాయిలో ఓపెనింగ్స్ రావాలని ఆశిస్తున్నారు ఫ్యాన్స్. అయితే హనుమాన్, ఈగల్, సైంధవ్, నా సామి రంగా మూవీలు ఎక్కడా వెనక్కు తగ్గడం లేదు. దీంతో ఈ చిత్రంపై ఓపెనింగ్స్ విషయంలో ఎఫెక్ట్ పడుతుందని అనుకుంటున్నారు. అలాగే ఈ కలెక్షన్ల ప్రభావం మిగిలిన సినిమాల ఓపెనింగ్స్ ‌పై కూడా పడొచ్చు. ఇక ఈ మూవీ ప్రమోషన్లను షురూ చేయడమే తరువాయి. మొదటి నుండి అడ్డంకులు ఎదుర్కొంటున్న ఈ మూవీలో మాస్ యాక్షన్ సీక్వెన్స్ హెలెట్ అని తెలుస్తోంది.  ఈ ఫైట్లు ఎలా ఉండబోతున్నాయో కాస్త వేచి చూడాల్సిందే. మరీ ఈ మూవీ ఎలా ఉండబోతుందనుకుంటున్నారో మీ అభిప్రాయాన్నికామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments