ఎంతో కష్టపడితే.. నా పేరు వేయలేదు.. పనిమనిషిలా ట్రీట్ చేశాడు

దర్శకుడు.. సినిమా తీసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటాడు. ప్రతి క్రాఫ్టుతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటాడు. కానీ కొన్ని కొన్ని సార్లు దురుసు ప్రవర్తన వల్ల కూడా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ దర్శకుడిపై కామెంట్స్ చేసింది ఓ కాస్ట్యూమ్ డిజైనర్

దర్శకుడు.. సినిమా తీసే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటాడు. ప్రతి క్రాఫ్టుతో మంచి సంబంధాన్ని కలిగి ఉంటాడు. కానీ కొన్ని కొన్ని సార్లు దురుసు ప్రవర్తన వల్ల కూడా వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా ఓ దర్శకుడిపై కామెంట్స్ చేసింది ఓ కాస్ట్యూమ్ డిజైనర్

సినిమా ఇండస్ట్రీలో హీరో తర్వాత దర్శక, నిర్మాతలదే హవా నడుస్తుంది. ముఖ్యంగా సినిమా స్టార్టింగ్ నుండి థియేటర్లలో రిలీజయ్యే వరకు మొత్తం బాధ్యతను డైరెక్టరే తన భుజాలపై వేసుకుంటాడు. 24 క్రాఫ్టులను మేనేజ్ చేస్తూ.. సినిమా సక్సెస్ అయ్యేందుకు కృషి చేస్తుంటాడు. ఎన్నో ఒత్తిడులను ఎదుర్కొంటాడు. తోటి వారితో చిరాకులు, పరాకులు కామన్ గానే ఉంటాయి. అతడు చెప్పినట్లు ఏ క్రాఫ్ట్ చేయకపోయినా పేకప్ చెప్పేయాల్సిందే. కానీ కావాలని టార్గెట్ చేస్తూ, దురుసుగా ప్రవర్తిస్తే.. అతడి దగ్గర వర్క్ చేయలేరు. ఇదిగో ఇప్పుడు ఓ దర్శకుడిపై అలాంటి ఆరోపణలు చేసింది కాస్ట్యూమ్ డిజైనర్. తనను ఆ దర్శకుడు ఓ పనిమనిషిలా చూశాడంటూ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ఇంతకు ఆమె ఎవరంటే..?

మలయాళ దర్శకుడు రథీశ్ బాలకృష్ణ పొడువల్‌పై కాస్ట్యూమ్ డిజైనర్ లిజి ప్రేమన్ తీవ్రమైన ఆరోపణలు చేసింది. తనను ఒక ఆర్టిస్టుగా చూడలేదని, అతడి కింద పనిచేసే ఓ పనిమనిషిలా తనను ట్రీట్ చేశాడని అంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్ని లిజి మాట్లాడుతూ… ‘సురేశంతియం సుమలతయుదేయమ్ : హృదయ హరియ ప్రణయ కథ’ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేశాను. తొలుత 35 రోజులు పని ఉందన్నారు. ఓకే చెప్పి.. రెండున్నర లక్షల రెమ్యునరేషన్ అడిగాను. సరేనని లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. ప్రీ పొడక్షన్ నుండి షూటింగ్ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా సమస్యలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా దర్శకుడి నుండి. అతడికి ఇగో ఎక్కువ.

నన్ను ఓ పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు నచ్చేది కాదు. అందరి ముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. చివరకు ఆ ప్రాజెక్టు నుండి తప్పుకున్నా. దీంతో సినిమాలో వర్క్ చేసినట్లు నా పేరు వేయలేదు. కాస్ట్యూమ్ డిజైనర్‌గా మరో వ్యక్తి పేరు వేసి.. తనకు అసిస్టెంట్ అని రాశారు. ఇది నన్ను అవమానించడమే. నాకు చెల్లించాల్సిన రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా నాపై కక్ష సాధింపు చర్యలు చేస్తున్న వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడనే ఉద్దేశంతో రిలీజ్ అయ్యే వరకు ఆగాను. ఇప్పుడు న్యాయం పోరాట చేస్తా. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్ చేస్తున్నా. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించిన డైరెక్టర్ సారీ చెప్పాలి’ అని పేర్కొంది కాస్ట్యూమ్ డిజైనర్ లిజి.

Show comments