Guntur Kaaram: గుంటూరు కారం 'నెక్కిలీసు గొలుసు' చాలా స్పెషల్‌

Guntur Kaaram: గుంటూరు కారం ‘నెక్కిలీసు గొలుసు’ చాలా స్పెషల్‌

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన గుంటూరు కారం సినిమాలో ఒక్కడు సినిమా రిఫరెన్స్ ఉంటుందని ఇంతకు ముందే ప్రచారం జరిగింది. ఇప్పుడు యూనిట్‌ సభ్యుల ద్వారా నెక్కిలీసు గొలుసు పాట రిఫరెన్స్ ఉంటుందని కూడా సమాచారం అందుతోంది. సినిమా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ కాంబోలో రూపొందిన గుంటూరు కారం సినిమాలో ఒక్కడు సినిమా రిఫరెన్స్ ఉంటుందని ఇంతకు ముందే ప్రచారం జరిగింది. ఇప్పుడు యూనిట్‌ సభ్యుల ద్వారా నెక్కిలీసు గొలుసు పాట రిఫరెన్స్ ఉంటుందని కూడా సమాచారం అందుతోంది. సినిమా అంచనాలు భారీగా పెరుగుతున్నాయి.

సూపర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందిన గుంటూరు కారంపై విడుదల తేదీ సమీపిస్తున్న కొద్ది అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. అతడు, ఖలేజా సినిమాల తర్వాత వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా ఇదే. చాలా సంవత్సరాలుగా ఈ కాంబో సినిమా కోసం ఫ్యాన్స్‌ వెయిట్‌ చేస్తున్నారు. ఇండస్ట్రీ హిట్‌ కొట్టిన త్రివిక్రమ్‌ దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా అంటూ ప్రకటించినప్పటి నుంచి అంచనాలు భారీగా పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సినిమా గురించి వెల్లడి అవుతున్న ఒక్కో విషయం సినిమా స్థాయిని అమాంతం పెంచేస్తూ ఉన్నాయి. తాజాగా ఈ సినిమాలో నెక్కిలీసు గొలుసు పాట రిఫరెన్స్ ఉంటుందని, అది ఓ రేంజ్ లో వినోదాన్ని పెంచుతున్నట్లు సమాచారం అందుతోంది.

గుంటూరు మిర్చీ యార్డ్‌ సెట్‌ లో మహేష్‌ బాబు మరియు శ్రీలీల పై ఉండే సన్నివేశాల్లో నెక్కిలీసు గొలుసు రిఫరెన్స్ అత్యంత కీలకంగా చెబుతున్నారు. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే విధంగా గుంటూరు కారం సినిమాను పలు రిఫరెన్స్ లను ఉపయోగించి త్రివిక్రమ్‌ చేశాడు. అల వైకుంఠపురం లో ఒక సన్నివేశంలో పాత పాటలు అన్నీ కూడా తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. ఇప్పుడు ఈ సినిమాలో కూడా ఒక్కడు సినిమాలోని చెప్పవే చిరుగాలి తో పాటు సూపర్ స్టార్‌ కృష్ణ పాట ఇంకా ఈ నెక్కిలీసు గొలుసు రిఫరెన్స్ కూడా ఉంటుందని యూనిట్‌ సభ్యుల ద్వారా విశ్వసనీయ సమాచారం అందుతోంది. సినిమా ఫుల్‌ గా వినోదాల విందు అన్నట్లుగా ఉంటుంది అంటూ మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు.

మహేష్‌ బాబు, శ్రీలీల జంటగా నటించగా మీనాక్షి చౌదరి కీలక పాత్రలో కనిపించబోతుంది. హీరోయిన్‌ గా శ్రీలీలకు కెరీర్‌ లో ఇదే అతి పెద్ద సినిమా. ఈ సినిమా పై ఆమె చాలా హోప్స్ పెట్టుకుంది. గుంటూరు కారంలో శ్రీలీల మరింత అందంగా కనిపిస్తోందని అభిమానులు పాటలు మరియు పోస్టర్స్ చూసిన తర్వాత కామెంట్స్ చేస్తున్నారు. ట్రైలర్‌ విడుదల తర్వాత గుంటూరు కారం సినిమా పై మరింతగా అంచనాలు, ఆసక్తి పెరగడం ఖాయం అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ట్రైలర్‌ ను సీరియస్‌ షాట్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకర్షించే విధంగా మంచి హ్యూమర్‌ షాట్స్ తో కూడా నింపేస్తున్నారట. మరి ఈ సంక్రాంతికి మీరు గుంటూరు కారం చూడబోతున్నారా?

Show comments