ఘనంగా స్టార్ హీరో కూతురి పెళ్లి.. ఫోటోలు వైరల్

Actor Jayaram: ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మారు మోగుతున్నాయి. నటీనటులు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు.

Actor Jayaram: ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుసగా పెళ్లి భాజాలు మారు మోగుతున్నాయి. నటీనటులు.. ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు మూడు ముళ్ల బంధంతో ఒక్కటవుతున్నారు.

ఇటీవల సినీ సెలబ్రెటీల ఇళ్లలో పెళ్లి భాజాలు మోగుతున్నాయి. గత ఏడాది నుంచి తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషలకు సంబంధించిన హీరో హీరోయిన్లు, సీనియర్ నటుల వారుసుల పెళ్లిళ్లు జరుగుతున్నాయి. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇటీవల తెలుగు ఇండస్ట్రీలో వరుసగా స్టార్ హీరోలకు తండ్రి పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్న ప్రముఖ నటులు జయరామ్ తన పిల్లల పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఒకప్పుడు మాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న నటుడు జయరామ్ ప్రస్తుతం స్టార్ హీరోలకు తండ్రి, మామ పాత్రల్లో నటిస్తున్నారు. మాలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ఆయన అక్కడ మాత్రమే కాదు.. తమిళ, తెలుగు ఇండస్ట్రీలో కూడా తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయన తన పిల్లల పెళ్లి సంబరాల్లో మునిగితేలుతున్నారు. జయరామ్ ఆయన సతీమణి నటి పార్వతి జయరామ్ కూతురు మాళవిక జయరామ్.. యూనైటెడ్ కింగ్ డమ్ కు చెందిన చార్టెడ్ అకౌంటెంట్ నవనీత్ గిరీష్ తో కేరళలోని గురువాయుర్ ఆలయంలో సింపుల్ గా జరిగింది. ఈ వివాహ మహోత్సవంలో కొద్దిమంది స్నేహితులు, బంధువులు మాత్రమే పాల్గొన్నట్లు తెలుస్తుంది.

ఇక పెళ్లి కొడుకు నవనీత్ కేరళాలోని పాలక్కాడ్ కి చెందినవాడు. మాళవిక విషయానికి వస్తే.. ఆమె వేల్స్ దేశంలో స్పోర్ట్స్ మేనేజ్ మెంట్ లో మాస్టర్స్ చేసింది. డిసెంబర్ 8న మాలవిక జయరామ్ నిశ్చితార్థానికి సంబంచి వీడియో వైరల్ అయ్యింది. నిశ్చితార్థానికి ముందే మాళవిక తన ఇన్‌స్టాగ్రామ్ లో నవనీత్ తో తాను ప్రేమలో ఉన్న విషయం గురించి తెలిపింది. మోడల్ తారిణి కళింగరాయర్ తో కాళిదాస్ నిశ్చితార్థ వేడుకలో ఈ జంట కనిపించారు. ప్రస్తుతం వీరి వెడ్డింగ్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. శుక్రవారం సాయంత్రం త్రిస్సూర్ లో రిసెప్షన్ జరగనుంది. ఈ కార్యక్రమానికి కేరళా సీఎం పినరయి విజయన్ సహా ఇతర రాజకీయ, సినీ సెలబ్రెటీలు హాజరు కానున్నారు.

Show comments