కొడితే ఇలాంటి Jobs కొట్టాలి.. ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు.. నెలకు రూ.1.50 లక్షల జీతం!

OIL India Recruitment 2024: నిరుద్యోగులకు భారీ శుభవార్త. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ సీనియర్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

OIL India Recruitment 2024: నిరుద్యోగులకు భారీ శుభవార్త. భారీ వేతనంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ సీనియర్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఉద్యోగాలు లేవని బాధపడే నిరుద్యోగులకు ఇది మంచి సమయం. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వరుస నోటిఫికేషన్లను విడుదల చేస్తున్నాయి. భారీ వేతనంతో కూడిన ఈ ఉద్యోగాలను సాధించి జీవితంలో స్థిరపడిపోవచ్చు. తాజాగా కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి ఆయిల్ ఇండియా లిమిటెడ్‌ సీనియర్ ఆఫీసర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 102 పోస్టులను భర్తీ చేయనున్నారు.

డిగ్రీ, పీజీ అర్హతతో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టుల కోసం అప్లికేషన్ ప్రక్రియ జనవరి 05 2024 నుంచి ప్రారంభమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జనవరి 29 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఉద్యోగార్థులు పూర్తి సమాచారం కోసం ఆయిల్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్ https://www.oil-india.com/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మొత్తం 102 పోస్టులు

విభాగాల వారీగా ఖాళీలు:

గ్రేడ్ సీ- 4 పోస్టులు

  • సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్(ఆర్థోపెడిక్స్) 01
  • సూపరింటెండింగ్ మెడికల్ ఆఫీసర్(రేడియాలజీ) 01
  • సూపరింటెండింగ్ ఇంజినీర్(ఎన్వీరాన్ మెంట్) 02

గ్రేడ్ బీ- 97 పోస్టులు

  • సీనియర్ ఆఫీసర్ (కెమికల్) 02
  • సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రికల్) 10
  • సీనియర్ ఆఫీసర్ (ఫైర్ అండ్ సేఫ్టీ) 11
  • సీనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్ 11
  • సీనియర్ ఆఫీసర్ (మెకానికల్) 41
  • సీనియర్ ఆఫీసర్ (ఇన్ఫర్ మేషన్ టెక్నాలజీ) 03
  • సీనియర్ ఆఫీసర్ (ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్) 06
  • సీనియర్ ఆఫీసర్ (పట్రోలియం) 05
  • సీనియర్ జియాలజిస్ట్ 03
  • సీనియర్ ఆఫీసర్ హెచ్ఆర్ 03
  • సీనియర్ ఆఫీసర్ హెచ్ఎస్ఈ 02

గ్రేడ్ ఎ- 1 పోస్ట్

  • కాన్ఫిడెన్షియల్ సెక్రటరీ 01

అర్హత:

  • అభ్యర్థులు పోస్టులననుసరించి గుర్తింపు పొందిన యూనివర్సిటీల నుంచి డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి:

  • ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కేటాగిరీల వారీగా 27 నుంచి 45 ఏళ్లు ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

అప్లికేషన్ ఫీజు:

  • జనరల్/ఓబీసీ (ఎన్సీఎల్) వర్గానికి చెందిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 500 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, పీడబ్య్లూడీ, ఈడబ్య్లూఎస్, ఎక్స్ సర్వీస్ మెన్లకు చెందిన అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ:

  • రాత పరీక్ష,ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు.

జీతం:

  • గ్రేడ్ సి, గ్రేడ్ బి, గ్రేడ్ ఏ పోస్టులలో ఎంపికైన అభ్యర్థులకు వరుసగా రూ. 1,50,000, రూ 1,20,000, రూ 90,000 జీతం అందించబడుతుంది.

దరఖాస్తు విధానం:

  • ఆన్ లైన్

దరఖాస్తు ప్రారంభం:

  • 05-01-2024

దరఖాస్తు ముగింపు తేదీ:

  • 29-01-2024

ఆయిల్ ఇండియా లిమిటెడ్ అధికారిక వెబ్ సైట్:

Show comments