10th పాసైతే చాలు.. BSFలో జాబ్స్.. నెలకు 81,100 జీతం

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? పదో తరగతి పాసైతే చాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు 81 వేల జీతాన్ని అందుకోవచ్చు.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారా? పదో తరగతి పాసైతే చాలు ఏకంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను పొందే అవకాశం వచ్చింది. ఈ పోస్టులకు ఎంపికైతే నెలకు 81 వేల జీతాన్ని అందుకోవచ్చు.

ఇటీవల కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి భారీ స్థాయిలో ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ అవుతున్నాయి. ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు ఇదే సరైన సమయం. మంచి వేతనంతో కూడిన ప్రభుత్వ ఉద్యోగాలను సాధించి జీవితంలో స్థిరపడిపోవచ్చు. మీరు పదోతరగతి పాసైతే లక్కీ ఛాన్స్. టెన్త్ అర్హతతోనే కేంద్ర ప్రభుత్వ కొలువును పొందే ఛాన్స్ వచ్చింది. ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకండి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ లో పలు ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు 81 వేల వరకు జీతం అందుకోవచ్చు. ఈ పోస్టులకు వయోపరిమితి, ఎంపిక విధానం వంటి వివరాలు మీకోసం.

బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్‌) పలు వెటర్నరీ స్టాఫ్ గ్రూప్-సి(నాన్ గెజిటెడ్) పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ జారీచేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 06 పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టులను అనుసరించి పదో తరగతి,ఇంటర్, వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థులు ఆన్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన పురుష, మహిళా అభ్యర్థులు ఈ పోస్టులకు పోటీపడొచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు జూన్ 17 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.

ముఖ్యమైన సమాచారం:

ఖాళీల సంఖ్య:

06.

విభాగాల వారీగా ఖాళీలు:

హెడ్ కానిస్టేబుల్ (వెటర్నరీ):

04

కానిస్టేబుల్ (కెన్నెల్‌మ్యాన్):

02

అర్హత:

పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్, వెటర్నరీ స్టాక్ అసిస్టెంట్ కోర్సు సర్టిఫికెట్‌తో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి:

అభ్యర్థులు 18 – 25 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.

దరఖాస్తు ఫీజు:

రూ.100 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు.

ఎంపిక విధానం:

రాత పరీక్ష, ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, మెడికల్ ఎగ్జామినేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

జీతం:

హెడ్ కానిస్టేబుల్‌కి నెలకు రూ.25,500 – రూ.81,100 చెల్లిస్తారు. కానిస్టేబుల్‌కు నెలకు రూ.21,700 – రూ.69,100 చెల్లిస్తారు.

దరఖాస్తు విధానం:

ఆన్‌ లైన్

దరఖాస్తుకు చివరి తేదీ:

17-06-2024

Show comments