ఈ జాబ్స్ వదలకండి.. ఎగ్జిమ్ బ్యాంకులో ఉద్యోగాలు.. నెలకు రూ. 69 వేల వరకు జీతం

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. ప్రభుత్వ రంగానికి చెందిన ఎగ్జిమ్ బ్యాంకు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

మీరు బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. ప్రభుత్వ రంగానికి చెందిన ఎగ్జిమ్ బ్యాంకు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఆ వివరాలు మీకోసం..

నిరుద్యోగులకు గుడ్ న్యూస్. బ్యాంకు ఉద్యోగాల కోసం ఎదురు చూసే ఆశావాహులకు ప్రభుత్వ బ్యాంకు తీపి కబురును అందించింది. ఏది వదిలినా.. ఈ జాబ్స్ ను మాత్రం వదలకండి. ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. 69 వేలకు పైగా జీతాన్ని అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని కోరింది. దరఖాస్తు చేసుకునేందుకు జనవరి 01 2024 వరకు అవకాశం కల్పించింది. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి.

ముంబయిలోని ఎక్స్‌పోర్ట్-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులకు స్పెషల్‌ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మేనేజర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ చేయనున్నారు. మొత్తం 15 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు ప్రక్రియను ప్రారంభించారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం ఎగ్జిమ్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్ https://ibpsonline.ibps.in/iebctnov23/ ను సందర్శించాలని సూచించింది. మరి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఎవరు అర్హులు, వయోపరిమితి, ఎంపిక ప్రక్రియ వంటి ఇతర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఖాళీలు:

  • 15

పోస్టుల వివరాలు:

మేనేజర్‌(మిడిల్‌ మేనేజ్‌మెంట్):

  • 03 పోస్టులు

అర్హత:

  • కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ, పీజీడీబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ అర్హత ఉండాలి.

అనుభవం:

  • అభ్యర్థులు ప్రస్తుతం ఏదైనా పబ్లిక్ సెక్టార్ బ్యాంకు, ఫైనాన్స్ సంస్థలు లేదా కేంద్ర/రాష్ట్ర ప్రభుత్వ విభాగాల్లో కనీసం 4 సంవత్సరాలుగా పనిచేస్తూ ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు ఎస్టీలకు 39 సంవత్సరాలు, ఓబీసీలకు 37 సంవత్సరాలు మించకూడదు.

జీతం:

  • ఎంపికైన వారికి నెలకు రూ.48,170-69,810 చెల్లిస్తారు.

మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎంటీ):

  • 12 పోస్టులు

అర్హత:

  • కనీసం 60 శాతం మార్కులతో డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. ఎంబీఏ, పీజీడీబీఏ (ఫైనాన్స్) లేదా సీఏ అర్హత ఉండాలి.

వయోపరిమితి:

  • అభ్యర్థుల వయసు ఎస్టీలకు 33 సంవత్సరాలు, ఓబీసీలకు 31 సంవత్సరాలు, దివ్యాంగులకు 41-43 సంవత్సరాలు మించకూడదు.

జీతం:

  • నెలకు రూ.36,000-63,840 చెల్లిస్తారు.

దరఖాస్తు ఫీజు:

  • ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది.

అప్లికేషన్ విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • ఆన్‌ లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తుకు చివరి తేది:

  • 01-01-2024

ఎగ్జిమ్ బ్యాంక్ అధికారిక వెబ్ సైట్:

Show comments