P Venkatesh
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రైల్ కోచ్ ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు పొందే ఛాన్స్ ఉంది.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూసే వారికి గుడ్ న్యూస్. రైల్ కోచ్ ఫ్యాక్టరీలో భారీగా ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. పరీక్ష రాయకుండానే ఉద్యోగాలు పొందే ఛాన్స్ ఉంది.
P Venkatesh
ప్రైవేట్ రంగంలో లక్షలు సంపాదించే ఉద్యోగం అయినా సరే.. ప్రభుత్వ ఉద్యోగాలకు ఉండే ప్రాధాన్యతే వేరు. అందుకే గవర్నమెంట్ ఉద్యోగాలకు సంబంధించి ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా కూడా లక్షల్లో పోటీపడుతుంటారు. ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు తీవ్రంగా శ్రమిస్తుంటారు. మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నట్లైతే ఇదే మంచి అవకాశం. రాత పరీక్ష లేకుండానే ఉద్యోగాలను పొందే ఛాన్స్ వచ్చింది. మీరు గుర్తింపు పొందిన బోర్డు నుంచి 50% మార్కులతో 10వ తరగతి లేదా తత్సమానం, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కలిగి ఉంటే చాలు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీలో ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయి.
పంజాబ్ రాష్ట్రం కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్) యాక్ట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా 550 పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ 09 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.