ITI Trade apprentices posts recruitment in MIDHANI Hyderabad: HYD మిధానిలో ఉద్యోగాలు.. రెండ్రోజుల్లో ముగియనున్న గడువు.. వెంటనే అప్లై చేసుకోండి

HYD మిధానిలో ఉద్యోగాలు.. రెండ్రోజుల్లో ముగియనున్న గడువు.. వెంటనే అప్లై చేసుకోండి

టెన్త్, ఇంటర్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

టెన్త్, ఇంటర్ పూర్తి చేసుకుని ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు శుభవార్త. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

మీరు ప్రభుత్వ ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్నట్లైతే మీకు ఓ గుడ్ న్యూస్. హైదరాబాద్ లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మీరు టెన్త్, ఇంటర్ ఉత్తీర్ణులై ఉద్యోగాల కోసం చూస్తున్నట్లైతే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్ వివిధ విభాగాల్లో ట్రేడ్‌ అప్రెంటిస్‌షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు జనవరి 8న అప్రెంటిస్‌షిప్ మేళా నిర్వహించనుంది. రెండ్రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనున్నది.

అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థులు తమ వివరాలను www.apprenticeshipindia.org పోర్టల్‌లో నమోదు చేసుకోవాలి. మీ E-KYCని పూర్తి చేసుకోవాలి. వయసు, విద్య, ఆధార్ వంటి దృవీకరణ పత్రాలతో మేళా సెంటర్‌లో హాజరు కావాలి. అభ్యర్థులు పూర్తి సమాచారం కోసం మిధాని అధికారిక వెబ్ సైట్ ను https://midhani-india.in/ పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ మొత్తం పోస్టులు
  • 165

ట్రేడ్లవారీగా ఖాళీలు:

  • ఫిట్టర్: 60
  • ఎలక్ట్రీషియన్: 30
  • మెషినిస్ట్: 15
  • టర్నర్: 15
  • డీజిల్ మెకానిక్: 03
  • ఏసీ మెకానిక్: 02
  • వెల్డర్: 25
  • సీవోపీఏ(కోపా): 15

అర్హత:

  • అభ్యర్థులు టెన్త్, సంబంధిత ట్రేడులో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు విధానం:

  • ఆన్‌ లైన్

ఎంపిక విధానం:

  • పదోతరగతి, ఐటీఐలో పొందిన మార్కులు, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

స్టైపెండ్:

  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ ట్రైనీ పోస్టులకు ఎంపికైన వారికి నెలకు రూ.7 వేలు అందిస్తారు.

అప్రెంటిస్‌షిప్ మేళా తేదీ:

  • 08-01-2024.

మేళా సెంటర్:

  • గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్, ఓల్డ్ సిటీ, హైదరాబాద్.
Show comments