SAIL Management Trainee Recruitment 2023: ఈ అవకాశం అస్సలు వదలొద్దు.. SAILలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,80,000 జీతం

ఈ అవకాశం అస్సలు వదలొద్దు.. SAILలో ఉద్యోగాలు.. నెలకు రూ.1,80,000 జీతం

కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. రూ.1,80,000 వేతనాన్ని అందుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి.

కేంద్ర ప్రభుత్వ సంస్థ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు ఏకంగా రూ. రూ.1,80,000 వేతనాన్ని అందుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా అప్లై చేసుకోండి.

మన దేశంలో ప్రభుత్వ ఉద్యోగాలకు డిమాండ్ ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. తక్కువ స్థాయి ఉద్యోగమైనా సరే ప్రభుత్వ ఉద్యోగమే కావాలని పట్టుబట్టిన వారు ఎంతో మంది ఉంటారు. ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగమైతే సమాజంలో మంచి గుర్తింపు, నెల తిరిగే సరికల్లా చేతికందే జీతం ఇంకా ఇతర సదుపాయాలు ఉండడంతో ప్రభుత్వ ఉద్యోగాలకు అంతటి కాంపిటీషన్ ఉంటుంది. మరి మీరు కూడా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నట్లైతే మీకు ఓ గుడ్ న్యూస్. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, దేశవ్యాప్తంగా ఉన్న సెయిల్‌ స్టీల్ ప్లాంట్లు/ యూనిట్లు, గనుల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ ద్వారా మొత్తం 92 పోస్టులను భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే నెలకు రూ. 1,80,000జీతాన్ని అందుకోవచ్చు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ డిసెంబరు 11న ప్రారంభంకాగా, డిసెంబరు 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు సెయిల్ అధికారిక వెబ్ సైట్ https://sailcareers.com/ ను పరిశీలించాల్సి ఉంటుంది.

ముఖ్యమైన సమాచారం:

  • మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

మెంత్తం పోస్టులు:

  • 92

విభాగాల వారీగా పోస్టులు:

  • కెమికల్ ఇంజినీరింగ్ 03, సివిల్ ఇంజినీరింగ్ 03, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ 26, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్ 07, మెకానికల్ ఇంజినీరింగ్ 34, మెటలర్జికల్ ఇంజినీరింగ్ 05, మైనింగ్ ఇంజినీరింగ్ 14,

విద్యార్హత:

  • 65 శాతం మార్కులతో సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పాసై ఉండాలి.

వయోపరిమితి:

  • 31.12.2023 నాటికి ఎస్సీ, ఎస్టీలకు 33 సంవత్సరాలు, ఓబీసీ అభ్యర్థులు 31 సంవత్సరాలకు మించకూడదు. ఇక దివ్యాంగులకు 10 సంవత్సరాలు, డిపార్ట్‌మెంటల్ అభ్యర్థులకు 45 సంవత్సరాలకు మించకూడదు.

ఎంపిక ప్రక్రియ:

  • అభ్యర్థులను ఆన్‌ లైన్ రాతపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

వేతనం:

  • ఎంపికైన వారికి నెలకు రూ.60,000 – రూ.1,80,000 అందిస్తారు.

అప్లికేషన్ ఫీజు:

  • ఓబీసీ అభ్యర్థులు రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులు రూ.200 చెల్లించాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:

  • 11-12-2023.

దరఖాస్తుకు చివరితేది:

  • 31-12-2023.

సెయిల్ అధికారిక వెబ్ సైట్:

Show comments