RCBకి వార్నింగ్ ఇచ్చిన SRH ఓపెనర్లు.. ఇక పెను విధ్వంసమే!

హైస్కోరింగ్ మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ను చిత్తు చేసిన సన్​రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ ఆర్సీబీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు బెంగళూరుకు ఎస్ఆర్​హెచ్ ఓపెనర్లు వార్నింగ్ ఇచ్చారు.

హైస్కోరింగ్ మ్యాచ్​లో ఢిల్లీ క్యాపిటల్స్​ను చిత్తు చేసిన సన్​రైజర్స్ హైదరాబాద్ నెక్స్ట్ ఆర్సీబీతో తలపడనుంది. అయితే ఈ మ్యాచ్​కు ముందు బెంగళూరుకు ఎస్ఆర్​హెచ్ ఓపెనర్లు వార్నింగ్ ఇచ్చారు.

సన్​రైజర్స్ హైదరాబాద్ జట్టు రాత మారింది. ఒక్క సీజన్ గ్యాప్​లో ఆ టీమ్ ఆడేతీరు కంప్లీట్​గా ఛేంజ్ అయింది. ఇంతవరకు బౌలింగ్ బలంగా ఆడుతూ వచ్చిన ఆరెంజ్ ఆర్మీకి ఇప్పుడు బ్యాటింగ్ యూనిట్ అతిపెద్ద బలంగా మారింది. ఎస్​ఆర్​హెచ్ బ్యాటర్లు గ్రౌండ్​లోకి దిగింది మొదలు ఇన్నింగ్స్ పూర్తయ్యే వరకు ప్రత్యర్థి బౌలర్లను ఊచకోత కోస్తున్నారు. దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. ఆ బౌలర్, ఈ బౌలర్ అనే తేడాల్లేవ్, పవర్​ప్లేనా అనేది పట్టించుకోవడం లేదు, ఏ ఫీల్డర్ ఎక్కడున్నాడు అనే దాంతో సంబంధం లేకుండా బాల్​ను బాదితే బౌండరీ లైన్ దాటాలి లేదా స్టాండ్స్​లో పడాలనే సూత్రంతో చెలరేగుతున్నారు. నిన్న ఢిల్లీ క్యాపిటల్స్​తో మ్యాచ్​లోనూ ఇలాగే ఆడి 266 పరుగుల భారీ స్కోరు చేశారు. ఛేజింగ్​లో డీసీ 199 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ మ్యాచ్​ తర్వాత ఆర్సీబీకి వార్నింగ్ ఇచ్చారు ఎస్ఆర్​హెచ్ ఓపెనర్లు.

అపోజిషన్ టీమ్స్​పై ఉరుములా విరుచుకుపడుతున్నారు సన్​రైజర్స్ బ్యాటర్లు. 300 పరుగుల స్కోరును నమోదు చేయడమే తమ టార్గెట్ అని చెప్పిన ఎస్​ఆర్​హెచ్.. డీసీతో మ్యాచ్​లో దాన్ని అందుకోలేకపోయింది. 266 దగ్గరకు వచ్చి ఆగిపోయింది. ఈ సీజన్​లో 250 ప్లస్ స్కోర్లను మూడుసార్లు బాదిన ఆరెంజ్ ఆర్మీ.. 300 లక్ష్యాన్ని నెక్స్ట్ మ్యాచ్​తో అందుకోవాలని చూస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీతో మ్యాచ్ తర్వాత ఎస్​ఆర్​హెచ్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ పంచుకున్నారు. 266 కంటే 300 స్కోరు చాలా బాగుంటుందని, ఆ నంబర్​ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని అన్నారు. అదే తమ నెక్స్ట్ బిగ్ స్కోర్ అని చెప్పారు. ఆర్సీబీతో మ్యాచ్​కు టికెట్లు అన్నీ అమ్ముడుబోయాయని.. ఇదే ఫామ్​ను కంటిన్యూ చేస్తే ఆ మ్యాచ్​లోనే దీన్ని అందుకుంటామని తెలిపారు.

ఉప్పల్ వేదికగా ఆర్సీబీ-ఎస్​ఆర్​హెచ్​కు మధ్య ఏప్రిల్ 25వ తేదీన మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో డీసీతో మ్యాచ్ ముగిశాక మాట్లాడుతూ ఆ జట్టుకు వార్నింగ్ ఇచ్చారు హెడ్-అభిషేక్. నెక్స్ట్ మ్యాచ్​లో 300 టార్గెట్​ను అందుకోవడానికి ప్రయత్నిస్తామని స్పష్టం చేశారు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. డుప్లెసిస్ సేనకు ఇక మూడిందని, ఆ టీమ్ బౌలర్లకు బ్యాండ్ బాజా బారాతేనని కామెంట్స్ చేస్తున్నారు. అంతో ఇంతో బెటర్ బౌలింగ్ యూనిట్ ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్​ మీదే ఇంతలా విరుచుకుపడిన కమిన్స్ సేన.. చెత్త బౌలింగ్​​తో తిప్పలు పడుతున్న బెంగళూరును ఎలా వదులుతుందని క్వశ్చన్ చేస్తున్నారు. ఆర్సీబీతో మ్యాచ్​లో సన్​రైజర్స్ మరిన్ని రికార్డులు నమోదు చేయడం పక్కా అని చెబుతున్నారు. మరి.. ఆర్సీబీతో మ్యాచ్​లో ఎస్​ఆర్​హెచ్ 300 స్కోరు చేస్తుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: టీ 20 వరల్డ్ కప్ కోసం ఆస్ట్రేలియా ద్విముఖ వ్యూహం! ఆ రాక్షసులు ఇద్దరే ఓపెనర్స్!

Show comments