పాండ్యాకు గట్టి క్లాస్‌ పీకిన రోహిత్‌ శర్మ! షాకింగ్‌ వీడియో లీక్‌

ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ గట్టి క్లాస్ పీకాడు. ఈ మ్యాచ్​లో అన్ని విధాలుగా ఫెయిలైన పాండ్యాపై హిట్​మ్యాన్ సీరియస్ అయ్యాడు.

ముంబై కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ గట్టి క్లాస్ పీకాడు. ఈ మ్యాచ్​లో అన్ని విధాలుగా ఫెయిలైన పాండ్యాపై హిట్​మ్యాన్ సీరియస్ అయ్యాడు.

భవిష్యత్ కోసమంటూ 5 కప్పులు అందించిన కెప్టెన్​ను పక్కనబెట్టారు. ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా అతడ్ని తొలగించారు. తమ టీమ్​ను వదిలేసి మంచి ఆఫర్ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్​కు వెళ్లిపోయిన ప్లేయర్​ను మళ్లీ తెచ్చుకున్నారు. ఎక్కువ డబ్బులు చెల్లించి అతడ్ని మినీ ఆక్షన్​లో దక్కించుకున్నారు. రావడం రావడమే.. జట్టుకు కెప్టెన్​ను కూడా చేశారు. అతడు టీమ్​ను విజయాల బాటలో నడిపిస్తాడని అనుకుంటే మొదటి మ్యాచ్​లోనే షాక్ తగిలింది. గెలవాల్సిన మ్యాచ్​లో గుజరాత్ టైటాన్స్ చేతుల్లో అనూహ్యంగా ఓటమిపాలైంది ముంబై ఇండియన్స్. నయా కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటర్​గా, బౌలర్​గా, కెప్టెన్​గా టోటల్ ఫెయిల్ అయ్యాడు. సారథ్య బాధ్యతలు కోల్పోయిన రోహిత్ శర్మ మాత్రం బ్యాటింగ్​లో అదరగొట్టాడు. అయితే మ్యాచ్ తర్వాత వీళ్లిద్దరి మధ్య జరిగిన ఓ ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్​లో ముంబై ఓడిపోవడంతో ఆ టీమ్ ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. రోహిత్ అలరించినా మిగతా బ్యాటర్లు రాణించకపోవడంతో 6 పరుగుల తేడాతో ఓటమిపాలైంది ఎంఐ. హార్దిక్ పాండ్యా ఆఖర్లో వచ్చి గెలిపిస్తాడనుకుంటే అదీ సాధ్యం కాలేదు. బ్యాటింగ్​లో ముందు దిగాల్సిన పాండ్యా.. టిమ్ డేవిడ్​ను పైకి పంపడం వర్కౌట్ కాలేదు. డేవిడ్​తో పాటు తిలక్, ఆ తర్వాత హార్దిక్ కూడా త్వరగా ఔట్ అవడంతో ఓటమి తప్పలేదు. దీంతో మ్యాచ్ తర్వాత కొత్త కెప్టెన్​కు గట్టి క్లాస్ పీకాడు రోహిత్. మ్యాచ్ పూర్తయ్యాక గుజరాత్ ప్లేయర్లతో మాట్లాడుతున్న హిట్​మ్యాన్ దగ్గరకు వెళ్లి కౌగిలించుకున్నాడు హార్దిక్. అంతే ఓడిపోయామనే ఫ్రస్ట్రేషన్​లో ఉన్న రోహిత్.. పట్టరాని కోపంతో గట్టిగా అరిచాడు. ఆ మాత్రం కూడా అర్థం కాదా? అంటూ అతడికి ఏదో చెప్పాడు.

సీరియస్​గా కనిపించిన రోహిత్.. రెండు చేతులు పైకి అంటూ ఏదో విషయం గురించి ఎక్స్​ప్లెయిన్ చేశాడు. చాలా సేపు హార్దిక్​తో అలాగే మాట్లాడుతూ క్లాస్ పీకాడు. ఆ టైమ్​లో ఏం చేయాలో అర్థం కాని పాండ్యా.. సైలెంట్​గా అతడు చెప్పేది విన్నాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ హార్దిక్ ఇలాగే టీమ్​ను నడిపిస్తే రోహిత్ నుంచి తిట్లు కూడా తినాల్సి ఉంటుందని కామెంట్స్ చేస్తున్నారు. ఆశిష్​ నెహ్రా కోచ్​గా ఉన్నాడు కాబట్టి గుజరాత్​ టీమ్​ గెలుస్తూ వచ్చిందని.. అది పాండ్యా గొప్పతనం కాదని అంటున్నారు. హార్దిక్​కు కెప్టెన్సీ చేతకాదని, అతడ్ని నమ్మి ముంబై మేనేజ్​మెంట్ చాలా పెద్ద తప్పు చేసిందని చెబుతున్నారు. రోహిత్ క్లాస్ పీకుతున్న తీరు, గ్రౌండ్​లో హార్దిక్ ఓవరాక్షన్ అంతా చూస్తుంటే.. పాండ్యాకు కెప్టెన్సీ ఓనమాలు కూడా తెలియదన్నట్లు కనిపిస్తోందని అంటున్నారు. మరి.. పాండ్యాకు రోహిత్ క్లాస్ పీకడంపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments