Venkateswarlu
Venkateswarlu
జపాన్ దేశానికి మళ్లీ గడ్డు పరిస్థితి మొదలైంది. అక్కడి ప్రజలు సునామీ భయంతో బిక్కు బిక్కుమని బతుకుతున్నారు. జపాన్ ఈస్ట్ కోస్ట్ ఏరియాలోని ఇజూ ఐస్ ల్యాండ్స్‌లోని సముద్రంలో తాజాగా భారీ భూకంపం సంభవించింది. ఆ భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.6గా నమోదైంది. సముద్రంలో 10 కిలీమీటర్ల లోతులో ఈ భూకంపం వచ్చినట్లు అధికారులు తెలిపారు. సముద్రంలో భారీ భూకంపం వచ్చిన నేపథ్యంలో సునామీ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.
ఈ మేరకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. పసిఫిక్ మహా సముద్రం తీరంలో అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నట్లు వారు తెలిపారు. పలు ప్రాంతాల్లో అలలు 3నుంచి 4 మీటర్ల ఎత్తు వరకు ఎగసిపడే అవకాశం ఉందని వెల్లడించారు. సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చే అవకాశం కూడా ఉందని తెలిపారు. తీర ప్రాంత ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అయితే, ఈ సునామీ కారణంగా పెద్దగా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. మరి, జపాన్ దేశంలో సునామీ వచ్చే అవకాశం ఉండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Tsunami Advisory – 10/5, 11:06am
A Tsunami Advisory has been issued. Waves of up to 1m are expected. Those near coastal areas, rivers, or lakes should evacuate to higher ground immediately. #tsunami pic.twitter.com/l8tOMTTZHq— NERV (@EN_NERV) October 5, 2023