ఘోర ప్రమాదం: లోయలో పడిన బస్సు..17 మంది దుర్మరణం!

నిత్యం ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ బస్సు ప్రమాదం జరగ్గా.. 17 మంది దుర్మరణం చెందారు. ఓ కార్యక్రమం నిమిత్తం కొందరు బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

నిత్యం ఎన్నో ఘోర రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఓ బస్సు ప్రమాదం జరగ్గా.. 17 మంది దుర్మరణం చెందారు. ఓ కార్యక్రమం నిమిత్తం కొందరు బస్సులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

నిత్యం ఏదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు జరుగుతునే ఉన్నాయి. అతివేగం, నిర్లక్ష్యంగా, మద్యం తాగి వాహనాలు నడపడంతో ఈ  ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. అంతేకాక ఘాట్ రోడ్డు, లోయ ప్రాంతాల్లో కూడా రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇక ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు మృతి చెందుతున్నారు. మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. అంతేకాక ఈ ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. తాజాగా లోయలో బస్సు పడిపోయి.. 17 మంది దుర్మరణం చెందారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

లోయల్లో, నదుల్లో వాహనాలు పడిపోయాయి అనే వార్తలు తరచూ వింటూ ఉన్నాము. వాహనాలు అదుపు తప్పడం లేదా బ్రేక్స్ ఫెయిల్ కారణంగా వాహనాలు నదుల్లో, లోయల్లో పడిపోతున్నాయి. ఇలాంటి ప్రమాదాల్లో మృతుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. ఇటీవలే మహారాష్ట్రలో వంతెనపై నుంచి ట్రాక్టర్ పడిపోయి ఆరు మంది మరణంచిన సంగతి తెలిసిందే. అలానే తమిళనాడులో కోయంబత్తూరు ప్రాంతంలో టూరిస్టుల బస్సు లోయలో పడి.. ఏడుగురు మృతి చెందారు. తాజాగా పాకిస్తాన్ లో జరిగిన ఓ ఘోర రోడ్డు ప్రమాదంలో 17 మంది మృతి చెందారు. దీంతో ఆ కుటుంబాల్ల తీవ్ర విషాదం అలుముకుంది. ఈ ఘటనలో 38 మందికి గాయాలయ్యాయి.

పాకిస్తాన్ లోని సింధ్, బలోచిస్తాన్ ప్రావిన్స్ ల సరిహద్దుల్లోని హుబ్ పట్టణ సమీపంలో బుధవారం రాత్రి సమయంలో ఈ ఘ టన చోటుచేసుకుంది. సింధ్‌ ప్రావిన్స్‌లోని తట్టా పట్టణానికి చెందిన కొందరు దర్గాకు వెళ్లాలని ఆలోచించారు. ఈ నేపథ్యంలోనే బుధవారం మధ్యాహ్నం బలోచిస్తాన్‌లోని హుబ్‌ పట్టణంలోని షా నూరానీ దర్గాకు బయలుదేరారు. మార్గం మధ్యలో వారు ప్రయాణిస్తున్నబస్సు ఘోర ప్రమాదానికి గురైంది. వారు ప్రయాణిస్తున్న బస్సు రాత్రి 8 గంటల సమయంలో అదుపుతప్పి రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. రాత్రి వేళ కావడంతో ప్రమాదాన్ని గుర్తించేదుంకు చాలా సమయం పట్టినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇక  ప్రమాదంలో 17 మంది దుర్మరణం చెందారు. అలానే 38 మందికి తీవ్ర గాయాలయ్యాయి.

క్షతగాత్రులను ప్రమాదం ఘటన స్థలానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కరాచీ నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషయంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. ఇటీవలే రెండు రోజుల క్రితం తమిళనాడులో ఘోర కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. వేగంగా వచ్చిన ఓ కారు బైక్ ను ఢీ కొట్టి గాల్లో ఫల్టీలు కొట్టింది.  ఈఘటనలో కారులోని నలుగురు, బైక్ పై ఉన్న వ్యక్తి దుర్మరణం చెందారు. ఇలా నిర్లక్ష్యంపు డ్రైవింగా కారణంగా ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసి పోతున్నాయి.

Show comments