P Krishna
Bitten Venomous Snakes: పాము అంటే ఎలాంటి వారైనా భయంతో వణికిపోతారు. తమ చుట్టుపక్కల పాములు సంచరిస్తున్నాయంటే వారి టెన్షన్ మాటల్లో చెప్పలేం. పాము అంటే ఎంత భయపడతారో.. అంతే భక్తితో పూజిస్తుంటారు.
Bitten Venomous Snakes: పాము అంటే ఎలాంటి వారైనా భయంతో వణికిపోతారు. తమ చుట్టుపక్కల పాములు సంచరిస్తున్నాయంటే వారి టెన్షన్ మాటల్లో చెప్పలేం. పాము అంటే ఎంత భయపడతారో.. అంతే భక్తితో పూజిస్తుంటారు.
P Krishna
ప్రపంచంలో కొన్ని పాములు అతి భయంకరమైన విషాన్ని కలిగి ఉంటాయి. సాధారణంగా వర్షాలు, వరదల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో పాముల బెడద ఎక్కువగా ఉంటుంది. ప్రపంచంలో పాము కాటుతో వందల మంది చనిపోతుంటారు. విషపూరితమైన పాములు మీ ఇంటి ఆవరణలోకి వచ్చాయంటే భయంతో వణికిపోతారు.. వెంటనే పాములు పట్టేవారికి ఫోన్ చేసి చెబుతారు. ఉత్తర్ ప్రదేశ్ లోని ఫతేపూర్ జిల్లా మాల్వా పోలీస్ స్టేషన్ పరిధిలో సౌరా గ్రామంలో వికాస్ దూబే అనే యువకుడిని పాము ఐదు సార్లు కాటు వేసింది. అదృష్టం కొద్ది ఆ యువకుడు చికిత్స తీసుకొని బతికిపోతున్నాడు. అయితే ఓ వ్యక్తిని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 172 సార్లు పాము కాటు వేయడం అందరికీ షాక్ ఇస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..
అమెరికాలో ఓ వ్యక్తి తన జీవితంలో 172 సార్లు అత్యంత విషపూరితమైన పాము కాటుకు గురయ్యాడు. 20 సార్లు దాదాపు చావు అంచులకు వెళ్లి బతికి బయటపడ్డాడు. 2011 లో తన 100 ఏళ వయసులో కన్నుమూశారు. విచిత్రం ఏంటంటే అప్పటి వరకు ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. పదే పదే పాముతో కరిపించుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని భావించాడు. అతని పేరు బిల్ హూస్ట్.. అమెరికాలో స్నాక్ మ్యాన్ అని పిలిచేవారు. 1910 డిసెంబర్ 30న న్యూ జెర్సీలోని ప్యాటర్సన్ లో జన్మించాడు. ఏడేళ్ల వయసులోనే పాలుము పట్టడం మొదలు పెట్టాడు. ఎన్నో భయంకర విషపూరితమైన పాములు పట్టాడు.. అందుకే ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు సంపాదించారు. వాస్తవానికి పాము కాటుకు గురైన వారు బతకడం చాలా కష్టం. బిల్ హాస్ట్ పాముల కోసం ఫ్లోరిడాలో ప్రత్యేక మయామి సెర్పెంటారియం నిర్మించాడు. అందులో ఎన్నో జాతులకు సంబంధించి ప్రమాదకరమైన పాములు ఉండేవి.
పాములతో ఆయన విషాన్ని హరింప జేసే ఔషదాల ఉత్పత్తి కోసం ఉపయోగించేవారు. 1990 నాటికి ఆయన ప్రతి ఏడాది ఫార్మాన్యూటికల్ లాబోరేటరీలకు 36 వేల విషం నమూనాలు అందించినట్లు వార్తలు వచ్చాయి. అప్పట్లో ఆయన వద్ద దాదాపు పదివేల రకాల పాములు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. పాముల ఇంజెక్షన్ సమయంలో బిల్ హాస్ట్ ఎన్నోసార్లు కాటుకు గురయ్యేవాడు. కొన్నిసార్లు ఆయన పరిస్థితి విషమంగా మారేదనేవారు. విషాన్ని ఎదుర్కొవడానికి హూస్ట్ తనకు తాను చిన్న మొత్తాలలో పాయిజన్ ఇంజెక్ట్ చేసుకున్నట్లు సమాచారం. తద్వారా శరీరంలో యాంటీ – వెనమ్ రోగనిరోధక శక్తిని పొందినట్లు వినికిడి. 1954 లో ప్రపంచంలోకెల్ల అత్యంత విషపూరితమైన నీలిరంగు క్రైట్ కాటుగు గురై.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ ఫతేపూర్ కి చెందిన వికాస్ దుబే 5 సార్లు పాము కాటుకు గురైనట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో 172 సార్లు పాము కాటుకు గురైన బిల్ హూస్ట్ వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.