కీలక పరిణామం.. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్!

  • Author Soma Sekhar Published - 06:22 PM, Sat - 12 August 23
  • Author Soma Sekhar Published - 06:22 PM, Sat - 12 August 23
కీలక పరిణామం.. పాకిస్థాన్ తాత్కాలిక ప్రధానిగా అన్వర్ ఉల్ హక్!

ఎప్పుడూ ఉగ్రవాద దాడులతో వార్తల్లో నిలిచే పాకిస్థాన్.. గత కొద్ది కాలంగా రాజకీయ వార్తలతో నిలుస్తోంది. రెండు రోజుల క్రితం పాకిస్థాన్ పార్లమెంట్ అయిన నేషనల్ అసెంబ్లీ రద్దు అయిన విషయం తెలిసిందే. కాగా.. సాధారణ గడువుకు మూడు రోజుల ముందే పాక్ అసెంబ్లీని రద్దు చేశాడు అధ్యక్షుడు ఆరీఫ్ అల్వీ. ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సిఫారసు మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే పాకిస్థాన్ పాలిటిక్స్ లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ తాత్కాలిక ప్రధానిగా పాక్ సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎంపికైనట్లు ఆ దేశ ప్రధానమంత్రి కార్యాలయం(PMO) వెల్లడించింది.

పాకిస్థాన్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పాక్ తాత్కాలిక ప్రధానమంత్రిగా బలూచిస్థాన్ అవామీ పార్టీ సెనేటర్ అన్వర్ ఉల్ హక్ కాకర్ ఎంపికైయ్యాడు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది పాక్ ప్రధానమంత్రి కార్యాలయం. తాజాగా జరిగిన సమావేశంలో అన్వర్ పేరును మాజీ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ తో పాటుగా అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు రాజా రియాజ్ ఏకాభిప్రాయంతో సిఫారసు చేశారు. కాగా.. రెండు రోజుల కింద పాక్ పార్లమెంట్ అయిన నేషనల్ అసెంబ్లీ రద్దు అయిన విషయం మనకు తెలిసిందే. దీంతో పాకిస్థాన్ లో జనరల్ ఎన్నికలకు రంగం సిద్దమైంది.

అయితే పార్లమెంట్ రద్దు అయిన 60 రోజుల్లోగా ఎన్నికలు నిర్వహించాలి. కానీ గడువు ముగియడానికంటే ముందు అసెంబ్లీని రద్దు చేసినందువల్ల ఎన్నికల నిర్వహణకు మరో నెల అదనపు సమయం లభిస్తుంది. దీంతో 90 రోజుల లోపు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే పాక్ లో నవంబర్ లో ఎన్నికలు జరుగుతాయి. కానీ పాక్ లో నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంది. ఈ కారణంగా ఎన్నికలు ఆలస్యమయ్యే అవకాశం లేకపోలేదు. మరోవైపు అవినీతి కేసులో దోషిగా తేలి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు ఇమ్రాన్ ఖాన్.

ఇదికూడా చదవండి: వీడియో: దర్జాగా బ్యాంక్ దోపిడి.. 5 నిమిషాల్లో 14 లక్షలు చోరీ!

Show comments