దేశంలో పెరుగుతోన్న మానసిక రోగుల సంఖ్య! ఆ రెండిటి కోసమే పిచోళ్లు అవుతున్నారు!

Health News: గత కొన్నేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా చాలామంది మానసిక రుగ్మతల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజు రోజుకి ఈ మానసిక రోగుల సంఖ్య అనేది గణనీయంగా పెరిగిపోతుంది. అయితే ఈ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరచుకోవచ్చు? అనే కొన్ని విషయాలను ఇప్పుడ మనం తెలుసుకుందాం.

Health News: గత కొన్నేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా చాలామంది మానసిక రుగ్మతల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజు రోజుకి ఈ మానసిక రోగుల సంఖ్య అనేది గణనీయంగా పెరిగిపోతుంది. అయితే ఈ మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరచుకోవచ్చు? అనే కొన్ని విషయాలను ఇప్పుడ మనం తెలుసుకుందాం.

గత కొన్నేళ్ల నుంచి దేశ వ్యాప్తంగా చాలామంది మానసిక రుగ్మతల సమస్యలతో బాధపడుతున్నారు. అయితే రోజు రోజుకి ఈ మానసిక రోగుల సంఖ్య అనేది గణనీయంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా.. ఈ మానసిక ఆరోగ్య సమస్య అనేది దేశంలో కరోనా మహమ్మారి ఏర్పడిన తర్వాత నుంచి పెరిగిపోయింది. ఈ క్రమంలోనే.. ఎంతోమంది విపరీతమైన ఆందోళన, డిప్రెషన్ వంటి సమస్యల బారిన పడుతూ హాస్పటిల్స్ చూట్టూ తిరుగుతున్నారు. అసలు చిన్న వయసులోనే చాలామంది ఇలా మానసిక రుగ్మత సమస్యలతో ఎందుకు బాధపడుతున్నారా అని ఇటీవల కాలంలో చాలామంది అధ్యయనాలు కూడా చేస్తున్నారు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం..ఈ మానసిక సమస్యలనేవి కోవిడ్ తర్వాతే.. 25 శాతం పెరిగాయి. అయితే ఇలా ఆందోళనకు, డిప్రెషన్ గురవ్వడానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరచుకోవచ్చు? అనే కొన్ని విషయాలను ఇప్పుడ మనం తెలుసుకుందాం.

ఇలా దేశ వ్యాప్తంగా చాలామంది అతి చిన్న వయసు నుంచే తీవ్రమైన మానసిక రుగ్మతతో బాధపడుతుండటం వెనుక అనేక కారణాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఆశ్చర్యకరమైన విసయం ఏమిటంటే ఈ మానసిక ఆరోగ్య సమస్యలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నప్పటికీ చాలా సందర్భాల్లో వీటిని చాలామంది అంత త్వరగా గుర్తించలేక పోతున్నారు. దీంతో ఈ సమస్య అనేది దేశంలో క్రమేపి చాప కింద నీరులా పెరిగిపోతుంది. ఈ క్రమంలోనే ప్రజల మానసిక ఆరోగ్యం సమస్య అనేది గణనీయంగా ఎక్కువైపోతుంది. దీంతో ఈ సమస్య అనేది మొత్తం శరీరానికి ప్రభావితం చేసి మనిషిని క్షీణించేలా చేస్తుంది. మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కేసులు ఎందుకు పెరుగుతున్నాయి? మానసిక ఆరోగ్యాన్ని ఎలా మెరుగు పరచుకోవచ్చు? అనే విషయాలను తెలుసుకునేందుకు ఢిల్లీలోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ బిహేవియర్ అండ్ అలైడ్ సైన్సెస్ (ఇహ్‌బాస్ హాస్పిటల్)లో సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఓంప్రకాష్‌ తెలియజేశారు.

ఈ సందర్భంగా సైకియాట్రీ ప్రొఫెసర్ డాక్టర్ ఓంప్రకాష్‌తో మాట్లాడుతూ.. కరోనా మహమ్మారి తర్వాత మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులు మరింత పెరిగినట్లు ఆయన తెలిపారు. అంతేకాకుండా.. తీవ్రమైన మానసిక వ్యాధులతో బాధపడుతున్న రోగుల సంఖ్య పెరగడానికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే వీటిలో ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడం, వైవాహిక సంబంధాలలో విభేదాలు, జీవితంలోని కొన్ని విషాద సంఘటనలు జరగడమే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు అని చెప్పవచ్చు. ఇక మనిషి జీవనశైలిలో జరిగే చెడు ప్రభావం కూడా మానసిక ఆరోగ్యం క్షీణించడానికి మరో కారణం అవుతుంది. అందువల్లనే ఇటీవలి కాలంలో భారతదేశంలో మానసిక వ్యాధులు, ఆత్మహత్య ధోరణులు పెరుగుతున్నాయని, ముఖ్యంగా పని ఒత్తిడి, అలసట అధిక డిప్రెసన్ కు గురవుతున్నమని ఎక్కువ మంది ఫిర్యాదు చేస్తున్నట్లు డాక్టర్ ఓంప్రకాష్ తెలిపారు.

ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ.. మనిషి ఒంటరితనాన్ని ప్రపంచ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పుగా పరిగణిస్తోందని డాక్టర్ ఓం ప్రకాష్ వివరించారు. పైగా కరోనా మహమ్మారి తర్వాత ఒంటరి తనం కారణంగా మానసిక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ సమస్య అన్ని వయసుల వారిలో ముఖ్యంగా యువతలో అధికంగా కనిపిస్తుంది. WHO దీనిని ప్రపంచ ప్రాధాన్యతగా గుర్తించింది. సామాజిక కనెక్షన్‌లను ప్రోత్సహించడానికి కృషి చేస్తోంది.

అయితే, మానసిక రుగ్మతల సమస్యలతో బాధపడుతున్నవారు..  టెలిమనస్ హెల్ప్‌లైన్ 14416, 1-800-891-4416 సహాయం తీసుకోవాలని డాక్టర్ ఓంప్రకాష్ చెప్పారు. ఈ నెంబర్లకు కాల్ చేయడం ద్వారా మానసిక ఒత్తిడి, డిప్రెషన్‌తో బాధపడుతున్న వ్యక్తులు ఫోన్‌లో సహాయం పొందవచ్చు.

కాగా, ఈ మానసిక సమస్యల నుంచి ఎలా బయటపడాలంటే..

  • ఎల్లప్పుడూ సానుకూలంగా ఆలోచించాలి
  • మీరు చేసే పనిపై దృష్టి పెట్టాలి
  • అనవసరంగా చింతించకూడదు
  • ప్రతిరోజూ నిద్ర, మేల్కొనే సమయాన్ని సెట్ చేసుకోవాలి
  • యోగా సహాయం తీసుకోవచ్చు
    అయితే ఇవన్నీ చేసిన తర్వాత కూడా మీ మానసిక ఆరోగ్యం మెరుగుపడకపోతే వెంటనే వైద్యులను సంప్రదించడం చాలా మంచింది. మరి, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన కేసులు ఎందుకు పెరుగుతున్నాయా తెలిసిన సమాచారం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Show comments