Ayodhya Ram Mandir-Do This Pooja: అయోధ్య మందిర ప్రారంభోత్సం: ఇంట్లోనే రాముడిని ఇలా పూజిస్తే అయోధ్య వెళ్లినంత ఫలితం

అయోధ్య మందిర ప్రారంభోత్సం: ఇంట్లోనే రాముడిని ఇలా పూజిస్తే అయోధ్య వెళ్లినంత ఫలితం

Ayodhya Ram Mandir: బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రానికి వెళ్లలేకపోతున్నామని బాధ పడుతున్నారా.. అయితే ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటే.. అయోధ్య వెళ్లినంత ఫలితం లభిస్తుంది అంటున్నారు. ఆ వివరాలు.

Ayodhya Ram Mandir: బాల రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రానికి వెళ్లలేకపోతున్నామని బాధ పడుతున్నారా.. అయితే ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకుంటే.. అయోధ్య వెళ్లినంత ఫలితం లభిస్తుంది అంటున్నారు. ఆ వివరాలు.

మన దేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులంతా ఎన్నో శతబ్దాలుగా ఎదురు చూస్తోన్న భవ్య రామ మందిరం నిర్మాణం కల నేడు సాకారమయ్యింది. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా.. అయోధ్య గర్భగుడిలో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి భారీ ఎత్తున భక్తులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమం కోసం యోగి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడటం కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేసింది.

బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో స్వయంగా పాల్గొనాలని ప్రతి ఒక్కరు ఆశపడతారు. అయితే అందరూ ఇప్పుడు అయోధ్య వెళ్లడం సాధ్యం కాదు. అలాంటి వారు.. మీ ఇంట్లోనే ఇలా పూజ చేశారంటే.. అయోధ్య వెళ్లి రాముడిని దర్శించుకున్నంత పుణ్య ఫలం లభిస్తుంది అంటున్నారు పండితులు. ఈ పూజ విధానం అనుసరిస్తే సరి అని సూచిస్తున్నారు. మరి ఏం చేయాలంటే..

ఇంట్లోనే పూజా విధానం..

అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సం నాడు అనగా జనవరి 22, సోమవారం వేకువజామున నిద్రలేచి తల స్నానం చేయాలి. నది స్నానం అయితే మరీ మంచిది అంటున్నారు. ఆ తర్వాత మీ ఇంట్లోని పూజా మందిరంలో ఇక పీఠం వేసి దాని మీద పసుపు రంగు వస్త్రాన్ని పరిచి శ్రీరాముని ప్రతిమని దాని మీద పెట్టాలి. స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేయాలి. అయితే పూజ చేసే సమయంలో తూర్పు ముఖంగా కూర్చోవాలనే విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు.

అనంతరం పత్రం, ఫలం, పుష్పం, ధూపం, ధీపం సమర్పించాలి. అలానే స్వామి వారికి నైవేద్యం సమర్పించాలి. ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామునితో పాటు ఆయన పరమ భక్తుడైన ఆంజనేయ స్వామిని కూడా పూజించడం మంచిది అంటున్నారు పండితులు. అంతేకాక ఈ పవిత్రమైన రోజున రామ చరిత మానస్, శ్రీరామ రక్ష స్త్రోత్రం, సుందర కాండని పారాయణం చేయడం వల్ల పుణ్య ఫలం దక్కుతుందంటున్నారు పండితులు చెబుతున్నారు.

నేడు అయోధ్యలో జరిగే పూజా కార్యక్రమాలు మొత్తం 11 గంటల నుంచి ఒంటి గంట వరకు దూరదర్శన్ చానెల్లో ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. ఆ సమయంలో అక్కడ వేద పండితులు చెప్పిన విధంగా మీరు కూడా మీ ఇంట్లో పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలి. ఇప్పటికే అయోధ్య నుంచి వచ్చిన అక్షితలను ఇంటింటికీ పంచారు. పూజ సమయంలో పండితులు చెప్పినప్పుడు ఆ అక్షితలు ఇంట్లోని వారందరూ తల మీద వేసుకోవడం వల్ల శ్రీరాముడి ఆశీర్వాదం పొందిన వాళ్లు అవుతారు. ఇలా ఇంట్లోనే రాముని విగ్రహం ప్రతిష్టించి పూజించడం వల్ల అయోధ్యకి వెళ్లకపోయినా అక్కడికి వెళ్లిన పుణ్యం మీకు దక్కుతుంది అంటున్నారు పండితులు.

జనవరి 22కి మరో ప్రత్యేకత..

అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు అనగా జనవరి 22, సోమవారానికి మరొక ప్రాముఖ్యత కూడా ఉంది. ఆరోజు కూర్మ ద్వాదశి వచ్చింది. క్షీర సాగర మథనం సమయంలో విష్ణు మూర్తి కూర్మావతారం ఎత్తాడు. అందువల్ల కూర్మ ద్వాదశి రోజు విష్ణు మూర్తికి అంకితం చేయబడింది. రాముడు విష్ణువు అవతారం కనుకే.. నేడు ప్రాణ ప్రతిష్ట కోసం ఈ రోజును ఎంపిక చేశారు అంటున్నారు.

Show comments