వీడియో: ఛీ.. వీడూ ఓ కొడుకేనా..! ఆస్తి కోసం కన్నతండ్రిపై దారుణం

Tamilnadu News; నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్న సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఆస్తుల కోసం సొంతవారినే చంపుకుంటున్నారు.

Tamilnadu News; నేటి సమాజంలో మానవ సంబంధాలు మంటకలిసిపోతున్న సంఘటనలు తరుచూ జరుగుతున్నాయి. ఆస్తుల కోసం సొంతవారినే చంపుకుంటున్నారు.

సాధారణంగా  కన్న తల్లిదండ్రులు పిల్లలను కంటికి రెప్పలా కాపాడుకుంటారు. వాళ్లకు ఏ చిన్న ఇబ్బంది కలిగినా విలవిలాడిపోతుంటారు. తమ అర్హతకు మించి పిల్లలకు మంచి విద్యనందించాలని కష్టపడుతుంటారు. కొడుకు సమాజంలో గొప్ప పోజీషన్ లో ఉంటే ఎంతో సంతోషపడతారు.  వృద్దాప్య సమయంలో తమ పిల్లలను ఆదుకుంటారన్న ఆశతో తాము పస్తులుండైనా బిడ్డల కడుపు నింపుతారు. పిల్లలు ఎదుగుతుంటే ఎంతో మురిసిపోతుంటారు.కానీ ఈ కాలంలో పుత్ర సంతానం తల్లిదండ్రుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. ఆస్తి కోసం ఓ కొడుకు దారుణానికి తెగబడ్డ ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. వివరాల్లోకి వెళితే..

కలికాలంలో మాన సంబంధాల కన్నా ఆర్థిక బంధాలే ఎక్కువ అయ్యాయి. డబ్బు కోసం సొంతవాళ్లనే హింసిస్తున్నారు.. హత్యలు చేస్తున్నారు. ఇటీవల ఆస్తుల కోసం సొంత తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఒకరినొకరు చంపుకుంటున్న సంఘటనలు ఎన్నో వెలుగులోకి వచ్చాయి. తాజాగా అలాంటి ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ కసాయి కొడుకు తండ్రిని విచక్షణారహితగా పిడిగుద్దులు కురిపిస్తూ కాలితో తన్నుతు ఉన్న ఓ వీడియో అందరి హృదయాలు కలచి వేసింది. కొడుకు చేతిలో గాయపడ్డ తండ్రి చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. ఈ వీడియో సోషల్ మీడియాలోవైరల్ అయ్యింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

తమిళనాడుకు చెందిన ఎ కులందైవేల (63) శ్రీ అమృద సాగో ఇండస్ట్రీస్ యజమాని. వృద్దాప్య కారణంగా వ్యాపార బాధ్యతలతో పాటు ఆస్తులు పంచి ఇవ్వాలని కొంతకాలంగా కొడుకు సంతోష్ గొడవ పడుతున్నాడు. బాధ్యతలు అప్పగిస్తే కంపెనీ దివాల దీస్తాడని.. డబ్బు దుర్వినియోగం చేస్తాడన్న ఉద్దేశంతో కులందైవేల ఆ విషయాన్ని జరుపుకుంటూ వస్తున్నాడు. దీంతో తండ్రిపై సంతోష్ కసి పెంచుకున్నాడు. ఈ విషయాన్ని మరోసారి తండ్రితో ప్రస్తావించాడు. ఆయన మాత్రం ససేమిరా అనడంతో ఒక్కసారిగా కోపోద్రిక్తుడైన సంతోషో సోఫాపై కూర్చున్న తండ్రిపై పిడిగుద్దులు కురిపించాడు.. కాలితో తన్నాడు. కొడుకు విచక్షణారహితంగా కొడుతుంటే తండ్రి బాధతో విలవిలలాడిపోయాడు. ఓ వ్యక్తి వచ్చి సంతోష్ ని పక్కకు లాక్కెల్లాడు. ముఖం, ఛాతిపై బలంగా కొట్టడంతో కులందైవేల తీవ్రంగా గాయపడి స్పృహ తప్పి సోఫోలో పడిపోయాడు. అక్కడికి ఓ మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చి వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు. రెండు నెలలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కులందైవేల గుండెపోటుతో ఏప్రిల్ 18న తుదిశ్వాస విడిచాడు. కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సంతోష్ ని అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించారు. దర్యాప్తులో బాగంగా సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా ఈ పాశవిక దాడికి సంబంధిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయని పోలీసులు తెలిపారు.

Show comments