Venkateswarlu
Venkateswarlu
గత ఏడాదితో పోల్చుకుంటే హైదరాబాద్ నగరంలో ఈసారి వినాయక విగ్రహాల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా ఆడవాళ్లపై ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ఉండేందుకు షీ టీమ్‌లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే గణేష్ ఉత్సవాలకు వచ్చే మహిళలతో తప్పుగా ప్రవర్తించే వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇలా హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇప్పటి వరకు 400 మంది పోకిరీలను అరెస్ట్ చేశారు.
దీనిపై సీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. ‘‘గణేష్ ఉత్సవాల్లో మహిళలతో తప్పుగా ప్రవర్తించిన 400 మందిపై కేసులు నమోదు చేశాము. ఈ సారి అనుకున్న సమయం కంటే ముందుగానే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తయింది. జియో ట్యాగింగ్ లెక్కల ప్రకారం ఇప్పటివరకు 10 వేల విగ్రహాల నిమజ్జనం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది 10 నుంచి 15 శాతం ఎక్కువ విగ్రహాలు ఏర్పాటయ్యాయి’’ అని తెలిపారు. మరి, గణేష్ ఉత్సవాల్లో మహిళలతో తప్పుగా ప్రవర్తించిన 400 మంది పోకిరీలను పోలీసులు అరెస్ట్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.