అసలు వీళ్లు మనుషులేనా? వృద్ధురాలు అని కూడా చూడకుండా..!

అసలు వీళ్లు మనుషులేనా? వృద్ధురాలు అని కూడా చూడకుండా..!

సమాజంలో రోజు రోజుకు మానవత్వం కనుమరుగవుతోంది. గతంలో జరిగిన ఎన్నో ఘటనలు ఉదాహరణగా చెప్పవచ్చు. ఇదిలా ఉంటే.. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి వెలుగు చూసింది. ఓ 80 ఏళ్ల వృద్ధురాలిపై ఓ మహిళ అతి దారుణంగా వ్యవహరించింది. నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే ఘోరానికి ఒడిగట్టింది. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇంతకు అసలేం జరిగిందంటే?

పోలీసుల కథనం ప్రకారం.. ఏపీలోని కృష్ణా జిల్లా చాట్రాయి మండలం గుడిపాడులో అడిమిల్లి లూర్దమ్మ అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. అయితే ఆ వృద్ధురాలు గత కొంత కాలం నుంచి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. ఈ క్రమంలోనే లూర్దమ్మ స్థానికంగా ఉన్న ఓ ఇంటి వద్ద కూర్చుంది. దీంతో ఆ వృద్ధురాలి నుంచి దుర్వాసన వస్తుందని పక్కింటి మహిళ ఆ వృద్ధురాలిపై దాడి చేసింది. అంతే కాకుండా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని బెదిరించింది. ఇక లూర్దమ్మ అక్కడి నుంచి వెళ్లలేని పరిస్థితుల్లో ఉండడంతో ఆ మహిళ ఆ వృద్ధురాలిపై దాడి చేసి అక్కడి నుంచి ఈడ్చుకుంటూ తీసుకెళ్లింది.

దీనిని గమనించిన స్థానికులు తమ సెల్ ఫోన్ లో వీడియోలు తీసుకున్నారు. ఇక వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. ఇక ఈ ఘటనపై స్పందించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ వీడియోను చూసిన నెటిజన్స్ ఇదేం ఘోరం.. వృద్ధురాలిని అని కూడా చూడకుండా అలా ఈడ్చుకెళ్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. వృద్ధురాలు అని చూడకుండా ఈడ్చుకెళ్తున్న ఈ మహిళ దారుణంపై మీరెలా స్పందిస్తారు? మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఇది  కూడా చదవండి: తండ్రిని చంపాలని చూసిన కూతురు!ఎందుకో తెలుసా?

Show comments