Crime News: తల్లి వదిలేసి వెళ్లిపోయింది. అన్నీ తానై పెంచిన తండ్రిని రూ. 500 కోసం

తల్లి వదిలేసి వెళ్లిపోయింది. అన్నీ తానై పెంచిన తండ్రిని రూ. 500 కోసం

ప్రతి బంధం రూపాయి చుట్టూనే తిరుగుతుంది. కూలి పనులు చేసే భర్త దగ్గర డబ్బులు లేవని, పుట్టిన కొడుకును అతడి వద్దే వదిలేసి వెళ్లిపోయింది ఓ తల్లి. కొడుకును పెంచడం కష్టం అవుతుందని భావించిన తండ్రి.. మరో మహిళను ఆ తల్లి స్థానంలోకి తీసుకువచ్చాడు.. కానీ..

ప్రతి బంధం రూపాయి చుట్టూనే తిరుగుతుంది. కూలి పనులు చేసే భర్త దగ్గర డబ్బులు లేవని, పుట్టిన కొడుకును అతడి వద్దే వదిలేసి వెళ్లిపోయింది ఓ తల్లి. కొడుకును పెంచడం కష్టం అవుతుందని భావించిన తండ్రి.. మరో మహిళను ఆ తల్లి స్థానంలోకి తీసుకువచ్చాడు.. కానీ..

మానవ సంబంధాలు రోజు రోజుకూ దిగజారిపోతున్నాయి. ప్రేమ పాశానికి తల్లిదండ్రులు కట్టుబడి ఉంటుంటే.. పిల్లలు మాత్రం వారి పట్ల దారుణాతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తమ రెక్కల కష్టంతో బతుకు ఈడుస్తూ.. పిల్లల్ని పెద్ద పెంచి చేస్తున్నారు తల్లిదండ్రులు. వృద్ధాప్య దశకు చేరుకునే సమయంలో వారిని చూడాల్సింది పోయి.. డబ్బుల కోసం మానసికంగా హింసిస్తున్నారు కొంత మంది పిల్లలు. ఆస్తులు ఇవ్వాలని లేకుంటే చూడమని నిర్దాక్షిణ్యంగా వ్యహరిస్తున్నారు. ఆస్తులు పంచాక.. అనాథ శరణాలయాలు, రోడ్లపై వదిలేస్తున్నారు. మరికొంత మందైతే.. ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులపైనే పైనే ఆధారపడుతుంటాడు. డబ్బుల కోసం హింసిస్తూ ఉంటారు. ఇవ్వనంటే.. వారిపై దాడికి,అఘాయిత్యాలకు పాల్పడుతుంటారు.

కేవలం రూ. 500 కోసం కన్న తండ్రినే చంపేశాడో కిరాతక కొడుకు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో చోటుచేసుకుంది. అయితే తండ్రిని కొడుకే హతమార్చాడని తెలిసేది కాదు. కానీ ఓ కాంట్రాక్టర్ ఫోన్ కాల్ ఆధారంగా ఈ క్రైం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిలోక్ కుమారుడు సంజయ్.. ఇద్దరూ కూలి పనులు చేసుకుని బతుకుతున్నారు. సంజయ్ పుట్టాక.. ఆర్థికపరమైన ఇబ్బందులు కారణంగా అతడి తల్లి, బిడ్డను భర్తకు వదిలేసి వెళ్లిపోయింది. కొడుకు కోసం మరో మహిళను పెళ్లి చేసుకోగా.. ఆమె కూడా మొదటి భార్యలానే వదిలేసింది. దీంతో తండ్రీ, కొడుకులు ఇద్దరే ఉంటూ.. ఇటుక బట్టీలో కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కొడుకు సంజయ్ మద్యానికి బానిసయ్యాడు.

ఈ తాగుడు విషయంలో, డబ్బు విచ్చలవిడిగా ఖర్చు పెట్టడంపై తండ్రికి కొడుక్కి మధ్య గొడవలు జరుగుతున్నాయి. న్యూ ఇయర్ రోజు కూడా పనులకు వెళ్లి రాగానే.. తండ్రి త్రిలోక్‌ను కొడుకు రూ. 500 డబ్బులు అడిగాడు. తండ్రి డబ్బు ఇవ్వడానికి నిరాకరించి, ‘నువ్వు సంపాదిస్తాన్నావ్ కదా నేనెందుకు డబ్బులు ఇవ్వాలి’ అని అరిచాడు. ఈ విషయంపై ఇద్దరికి గొడవ జరగడంతో.. తండ్రి తన కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి కథంతా చెప్పాడు. మరుసటి రోజు కూలీ డబ్బులు ఇస్తానని కాంట్రాక్టర్ తన కుమారుడికి ఫోన్‌లో చెప్పారు. ఈ సంభాషణ కాంట్రాక్టర్ మొబైల్‌లో రికార్డ్ అయ్యింది. ఆ తర్వాత త్రిలోక్ చనిపోయాడు. త్రిలోక్ ఫోన్ డేటా ఆధారంగా పోలీసులు విచారించగా.. సంజయ్యే నిందితుడు అని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అప్పుడు అసలు నిజం వెలుగులోకి వచ్చింది.

కాంట్రాక్టర్ తన ఫోన్ చేసిన తర్వాత.. తండ్రికి, తనకు గొడవ జరిగిందని, ఆ టైంలో కోపంతో తనకు చేతికి దొరికిన చెక్క పలకతో తన నాన్న తలపై కొట్టానని చెప్పాడు. దెబ్బ బలంగా తగలడంతో రక్తమోడుతూ త్రిలోక్ చనిపోయాడు. తండ్రి చనిపోవడంతో మృతదేహాన్ని ఇంటి బయట పడేసి పారిపోయాడు. ఉదయం మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు అతనికి సమాచారం అందించగా, ఏమీ ఎరుగని వ్యక్తిలా వచ్చాడు. దీంతో పోలీసులకు కూడా కొడుకు చంపాడన్న అనుమానం రాలేదు. ఎప్పుడైతే.. త్రిలోక్ మొబైల్ నుండి కాంట్రాక్టర్‌ మొబైల్‌ కు కాల్ వెళ్లిందని తెలిసి.. అతడిని సంప్రదించాక అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కుమారుడిని అదుపులోకి తీసుకుని విచారించగా.. నేరాన్ని అంగీకరించాడు. రూ. 500 కోసం తండ్రిని తనయుడి చంపిన ఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments