అన్యోన్యమైన కాపురం.. కానీ భార్య తరచూ అలా చేస్తోందని..

భార్యా భర్తల మధ్య కోపతాపాలు సహజం. అప్పుడే తిట్టుకుంటారు. అప్పుడే కలిసిపోతుంటారు. అందుకే వీరి వ్యవహారంలోకి మరొకరు జోక్యం చేసుకోరు. కానీ కొన్ని సార్లు దంపతుల మధ్య సఖ్యత కొరవడి

భార్యా భర్తల మధ్య కోపతాపాలు సహజం. అప్పుడే తిట్టుకుంటారు. అప్పుడే కలిసిపోతుంటారు. అందుకే వీరి వ్యవహారంలోకి మరొకరు జోక్యం చేసుకోరు. కానీ కొన్ని సార్లు దంపతుల మధ్య సఖ్యత కొరవడి

కాపురంలో గిల్లికజ్జాలు ఉండొచ్చు కానీ.. తగాదాలు ఉంటే ఆ సంసారం ముందుకు సాగదు. పని చేసి ఇంటికి వచ్చిన భర్త.. భార్య నుండి కాస్తంత స్వాంతన కోరుకుంటాడు. అలాగే తాను అలసిపోయినప్పడు భర్త ఎంతో కొంత ఇంటి పనిలో, వంట పనిలో హెల్ప్ చేస్తే బాగుండు అని భావిస్తుంది భార్య. అలాగే ఇద్దరు ఉద్యోగాలు, పనులకు వెళ్లే వాళ్లయితే.. ఓ సమయం కేటాయించుకుని మాట్లాడుకుంటే..తమ జీవితానికి సమస్యాత్మకంగా మారుతున్న వాటిని కూడా పరిష్కరించుకోవచ్చు. కాదని భర్త మాట అన్నాడని భార్య.. కట్టుకున్న భార్య తనను అర్థం చేసుకోవడం లేదని భర్త.. ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటే.. ఆ కాపురం సజావుగా సాగిపోదు. ఇదిగో ఈ ఇద్దరి విషయంలో ఇదే జరిగింది.

కేవలం మనస్పర్థల కారణంగా భార్యను చంపి.. ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు భర్త. కానీ పోలీసులు అతడి ఆటను కట్టించారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. తిరుపత్తూరు జిల్లా కందిలి సమీపంలో నారియనేరి ప్రాంతంలో నివసిస్తున్నారు భార్యా భర్తలు రామన్, సూర్య. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. తొలుత వీరి కాపురం అన్యోన్యంగా సాగిపోయింది. అయితే బిజినెస్ నిమిత్తం రామన్ చెన్నై వెళ్లిన దగ్గర నుండి ఇద్దరి మధ్య దూరం పెరిగింది. కలహాలు మొదలయ్యాయి.  భర్త చెన్నైలో పానీపూరి షాప్ నడుపుతూ అక్కడే ఉంటున్నాడు. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. ఇటీవల చెన్నై నుండి ఇంటికి తిరిగి వచ్చాడు భర్త. అయితే చాన్నాళ్ల తర్వాత వచ్చిన భర్తతో ప్రేమగా మాట్లాడాల్సిన సూర్య.. అతడితో గొడవపడింది.

రాగానే చిర్రుబుర్రులాడుతున్న భార్యపై  కోపంతో ఊగిపోయిన రామన్.. సత్య గొంతు నులిమి చంపేశాడు. అనంతరం స్పృహతప్పి పడిపోయినట్లు నటించారు. స్థానికులు వచ్చి చూడగా..  మనస్తాపం చెందిన తన భార్య సూర్య తనకు తెలియకుండా ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని ఇరుగుపొరుగు వారికి చెప్పాడు. దీంతో షాక్‌కు గురైన స్థానికులు సూర్యను చికిత్స నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు సూర్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి రామన్‌ను విచారించారు.  తొలుత బుకాయించగా.. తమదైన స్టైల్లో విచారిస్తే..  ఆపై సూర్యను గొంతు నులిమి హత్య చేసినట్లు నిజం ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.  కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు.

Show comments