కొడుకు చదువు కోసం ఆ పని చేసిన తల్లి. . కానీ చివరకు

కొడుకు చదువు కోసం ఆ పని చేసిన తల్లి. . కానీ చివరకు

భర్త వ్యాపారంలో నష్టపోతే తల్లడిల్లిపోయింది భార్య. కొడుకుని చదివించాలంటే చిల్లిగవ్వ కూడా లేదు. కానీ ఆమె అలా కూర్చోలేదు. భర్త ఓ ఉద్యోగం చేస్తే.. ఆమె కూడా బట్టల దుకాణంలో చేరింది. కానీ

భర్త వ్యాపారంలో నష్టపోతే తల్లడిల్లిపోయింది భార్య. కొడుకుని చదివించాలంటే చిల్లిగవ్వ కూడా లేదు. కానీ ఆమె అలా కూర్చోలేదు. భర్త ఓ ఉద్యోగం చేస్తే.. ఆమె కూడా బట్టల దుకాణంలో చేరింది. కానీ

పైసాలోనే పరమాత్ముడు ఉన్నాడని అంటుంటారు. డబ్బులేకపోతే నేటి కాలంలో మనిషిని మనిషిగా చూడరు. డబ్బు చుట్టూనే ప్రపంచం తిరుగుతుందని భూమి మీద జీవిస్తున్న సగటు మనిషికి తెలుసు. కానీ ఆర్థిక అవసరాలు.. రాబడి కన్నా ఎక్కువ అవుతుంటాయి. దీంతో అప్పులు చేస్తుంటారు. తిరిగి ఆ డబ్బులు కూడా చెల్లించాల్సింది ఆ రాబడిలో నుండే అన్న విషయాన్ని మరిచిపోతుంటారు. ప్రస్తుతానికి సమస్య తీరిపోయింది కదా అనుకుని భావిస్తుంటారు. కానీ అప్పు కుప్పలా పేరుకుపోతూ ఉంటుంది. రుణాలు ఇచ్చిన వాళ్లు.. నెల అయ్యే సరికి ఠంచనుగా ఇంటి ముందు వాలిపోతుంటారు. కట్టకపోతే రాద్దాంతం, గొడవ చేస్తారు. మన కన్నీళ్లు, కష్టాలతో వారికి పని ఉండదు. డబ్బులు ఇవ్వకపోతే మరింత ఒత్తిడి చేస్తారు. పరువు బజారుకు ఈడుస్తుంటారు

కడతావా, చస్తావా అన్న బెదిరింపులకు భయపడి.. కట్టలేక, చావే శరణ్యమని భావిస్తున్నారు. అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఓ కుటుంబం చివరకు ఆత్మహత్యకు పాల్పడింది. మైక్రో ఫైనాన్స్ సంస్థ ఒత్తిడికి తట్టుకోలేక భార్యా భర్తతో పాటు చేతికొచ్చిన కొడుకు విషం దాగి మరణించిన ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వె ళితే.. మణిలాల్ (52), అతని భార్య స్మిత (45) భార్యా భర్తలు. వీరికి అభిలాల్ (22) కుమారుడు ఉన్నాడు. మణిలాల్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయగా.. అప్పుల పాలయ్యాడు. దీంతో భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. భార్యా ఓ దుస్తుల దుకాణంలో చేరింది. తన కొడుకు చదువు కోసం ఆమె అమరవిలలోని ఓ మైక్రో ఫైనాన్స్ సంస్థలో అప్పు తీసుకుంది.

వాటిని ఆమె సకాలంలో చెల్లించలేకపోయింది. దీంతో సంస్థ ఉద్యోగి తరచూ ఆమె పనిచేస్తున్న చోటుకు వెళ్లి.. డబ్బులు కట్టాలంటూ ఒత్తిడి చేస్తున్నాడు. దీంతో మార్చిలో ఆమె ఆ కంపెనీపై ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ వీరి ఒత్తిడి తగ్గలేదు. దీనికి తోడు మరింత ఆర్థిక ఇబ్బందులు ఎక్కువయ్యాయి. ఇక చావే శరణ్యమని భావించిన ఈ ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే సూసైడ్‌కు ముందు తాము చనిపోతున్నామంటూ వార్డు కౌన్సిలర్ కు సమాచారం ఇవ్వడంతో పరుగు పరుగున ఇంటికి చేరుకునే సరికి.. అప్పటికే ముగ్గురు విషం తాగి స్పృహతప్పి పడిపోయి కనిపించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు స్థానికులు. ముగ్గుర్ని ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. కేసు నమోదు పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.

Show comments