Today Gold Price Dropped: పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం ధర

పసిడి ప్రియులకు శుభవార్త.. దిగి వచ్చిన బంగారం ధర

త్వరలోనే దీపావళి పండుగ రానుంది.. ఆ తర్వాత వివాహాల సీజన్‌ ప్రారంభం కానుంది. దాంతో పసిడి డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు రేటు కూడా పెరగవచ్చు. కానీ నేడు మాత్రం గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. కనుక ఇప్పుడే త్వరపడండి.

త్వరలోనే దీపావళి పండుగ రానుంది.. ఆ తర్వాత వివాహాల సీజన్‌ ప్రారంభం కానుంది. దాంతో పసిడి డిమాండ్‌ పెరిగే అవకాశం ఉంది. అప్పుడు రేటు కూడా పెరగవచ్చు. కానీ నేడు మాత్రం గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. కనుక ఇప్పుడే త్వరపడండి.

నాలుగైదు రోజుల్లో దీపావళి పండుగ ఉంది.. చాలా మంది కచ్చితంగా బంగారం కొనాలని భావిస్తారు. పండగ తర్వాత వివాహాల సీజన్‌ ప్రారంభం అవుతుంది. దాంతో బంగారానికి భారీగా డిమాండ్‌ ఏర్పడుతుంది. గోల్డ్‌ లేకుండా పెళ్లిళ్లు జరగనే జరగవు. దాంతో ధర పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే గరిష్ట స్థాయిలకు చేరిన బంగారం ధర.. గత రెండు మూడు రోజులుగా దిగి వస్తోంది. క్రితం సెషన్‌లో గోల్డ్‌ రేటు స్థిరంగా ఉండగా.. నేడు మాత్రం దిగి వచ్చింది. ఇక మంగళవారం దేశీయ బులియన్‌ మార్కెట్‌లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

హైదరాబాద్ బులియన్‌ మార్కెట్‌లో మంగళవారం నాడు 22 క్యారెట్‌ బంగారం ధర పది గ్రాముల మీద రూ. 150 మేర తగ్గింది. దాంతో ప్రస్తుతం హైదరాబాద్‌ మార్కెట్‌లో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ పుత్తడి ధర రూ. 56,350 వద్ద ఉంది. 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర నేడు దిగి వచ్చింది. 10 గ్రాముల మీద 170 రూపాయలు తగ్గి..రూ. 61,470 వద్ద ట్రేడవుతోంది.

దేశ రాజధాని ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో సైతం పుత్తడి రేటు తగ్గింది. నేడు హస్తినలో22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు రూ. 150 తగ్గి రూ.56,500 మార్కు వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర కూడా 10 గ్రాముల మీద రూ. 170 పడిపోయి రూ. 61,620 వద్ద ఉంది.

పెరిగిన వెండి ధర..

నేడు బంగారం ధర దిగి వచ్చినప్పటికి.. వెండి రేటు మాత్రం పెరిగింది. నేడు ఢిల్లీ బులియన్‌ మార్కెట్లో సిల్వర్‌ రేటు కిలో మీద రూ.200 ఎగబాకి ప్రస్తుతం రూ. 75,200 వద్ద ఉంది.అలానే హైదరాబాద్‌లో కూడా వెండి ధర పెరిగింది. ఇక్కడ కూడా కిలో వెండి మీద రూ. 200 పైకి ఎగబాకి.. రూ. 78,200 వద్ద కొనసాగుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా గోల్డ్‌ రేటు దిగి వచ్చింది.

Show comments