పసిడి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. ఈ టైమ్ అస్సలు మిస్ కావొద్దు!

Gold and Silver Rates: దేశంలో ప్రతిరోజూ పసడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి. తులం బంగారం రూ.80 మార్క్ దాటే పరిస్థితికి చేరుకుంది.

Gold and Silver Rates: దేశంలో ప్రతిరోజూ పసడి ధరలు ఎప్పుడు పెరుగుతాయో.. ఎప్పుడు తగ్గుతాయో తెలియని అయోమయ పరిస్థితి. తులం బంగారం రూ.80 మార్క్ దాటే పరిస్థితికి చేరుకుంది.

ఇటీవల బంగారం ధరలు వరుసగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. కొనుగోలుదారులతో ధరలు దోబూచులాడుతున్నాయి. బంగారం ధరలు పెరిగినా.. తగ్గినా కొనుగోలు మాత్రం ఎక్కడా ఆగడం లేదు. ముఖ్యంగా భారత దేశంలో పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు ఎక్కువగా జరుగుతుంది. ఈ మధ్య బంగారం ఇన్వెస్ట్ మెంట్ గా కూడా ఉపయోగిస్తున్నారు. బంగారం కొనిపెట్టుకుంటే ఎప్పటికైనా డిమాండ్ ఉంటుందని మధ్యతరగతి ప్రజలు భావిస్తున్నారు. అందుకే ప్రపంచంలో బంగారం ఎప్పటికైనా విలువైనదే అంటారు.గత నెల పసిడి, వెండి ధరలు భారీగా పెరిగినా.. మే నెలలో కాస్త ఊరటనిస్తూ వచ్చాయి. పసిడి కొనుగోలుదారులకు శుభవార్త.. ఈ రోజూ కాస్త తగ్గుముఖం పట్టింది. మార్కెట్ లో పసిడి, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

దేశంలో బంగారం అంటే ఇష్టపడని వారు ఉండరు.. అందుకే దీనికి రోజు రోజుకీ డిమాండ్ పెరిగిపోతుంది. అంతర్జాయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల ప్రభావం పసిడి, వెండి పై పడటంతో ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకు షాక్ ఇచ్చిన పసిడి ఈరోజు కాస్త ఊరటనిస్తుంది. 22 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.10 తగ్గి.. రూ.67,590 కి చేరింది. 22 క్యారెట్ గోల్డ్ గ్రాము ధర రూ.6,759 గా ఉంది. ఇక 24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.10 తగ్గి.. రూ.73,740 చేరింది. 22 క్యారెట్ గోల్డ్ గ్రాము ధర రూ.7,374కి చేరుకుంది. తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,590 ఉంటే.. 24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.73,740 వద్ద ట్రెండ్ అవుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 67,740 ఉంటే.. 24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.73,890 వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబై, కోల్ కొతా, బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,590 ఉంటే.. 24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.73,740 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,690 ఉంటే.. 24 క్యారెట్లు 10 గ్రాముల పసడి ధర రూ.73,840 వద్ద ట్రెండ్ అవుతుంది. దేశ వ్యాప్తంగా కిలో వెండిపై రూ.100 తగ్గింది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.89,000 వద్ద కొనసాగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.92,400 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments