Gold and Silver Rates: రెండు రోజుల మురిపమే.. మళ్లీ లెక్క మారింది! ఈ రోజు ధర ఎంతంటే?

రెండు రోజుల మురిపమే.. మళ్లీ లెక్క మారింది! ఈ రోజు ధర ఎంతంటే?

Gold and Silver Rates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోయింది. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకటీ రెండు రోజులు కాస్త ఊరటనిచ్చినా మళ్లీ అదే రేంజ్ లో పుంజుకుంటున్నాయి.

Gold and Silver Rates: ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోయింది. దీంతో పసిడి ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. ఒకటీ రెండు రోజులు కాస్త ఊరటనిచ్చినా మళ్లీ అదే రేంజ్ లో పుంజుకుంటున్నాయి.

దేశంలో బంగారం కొనేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉంది. వివాహాది శుభకార్యాలకే కాదు.. బంగారం ఇప్పుడు మంచి ఇన్వెస్ట్ మెంట్ గా భావిస్తున్నారు. ఆపద సమయంలో అన్ని విధాలుగా బంగారం ఆదుకుంటుందని ప్రతి ఒక్కరూ అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా మధ్య తరగతికి చెందిన వారు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపించడం వల్ల తరుచూ పెరుగుతూ, తగ్గుతూ వస్తున్నాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి.. దీంతో కోనుగోలు శాతం భారీగా పెరిగిపోయింది. తాజాగా బంగారం మళ్లీ షాక్ ఇచ్చింది. నేడు మార్కెట్ లో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇటీవల పసిడి ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయో అర్థం కాని పరిస్థితి. గత వారంలో వరుసగా తగ్గుతూ వచ్చిన పసిడి ధర ఇప్పుడు ఒక్కసారే పెరిగిపోయింది. దీంతో కొనుగోలుదారులు రెండు రోజుల మురిపమే అన్నట్టు నిరాశలో మునిగిపోయారు. గత ఏడాదితో పోలిస్తే పసిడి ధర 5 వేలకు పైగా పెరిగిపోయింది. జనవరి, ఫిబ్రవరిలో భారీగా పతనమైన పసిడి ధరలు.. మార్చి, ఏప్రిల్ నెలలో చుక్కలు చూపించాయి. ఒకదశలో మేలిమి బంగారం రూ.75 పైగా చేరుకుంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో నిన్న మొన్న రూ.1090 మేర తగ్గి ఊరటనిచ్చింది. అది రెండు రోజుల మురిపంగా మారిపోయింది. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 10 పెరిగి రూ. 72,280 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 10 పెరిగి రూ.66,260 వద్దకు చేరింది. ప్రస్తుతం ఒక్క గ్రాము గోల్డ్ ధర రూ.6,626 గా కొనసాగుతుంది. అలాగే కిలో వెండి ధర రేటు రూ.500 మేర పెరిగి ర.83,500లకు చేరుకుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,410 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,430 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.66,260 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.72,280 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,160 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.73,260 వద్ద కొనసాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,260 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,280 వద్ద ట్రెండ్ అవుతుంది. వెండి కోల్‌కొతాలో కిలో రూ.83,600, బెంగుళూరులో రూ.82,150 వద్ద కొనసాగుతుంది.

Show comments