స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. నేడు ఎంతంటే?

Gold and Silver Rates: ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి.

Gold and Silver Rates: ఇటీవల అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరల్లో తరుచూ మార్పులు సంభవిస్తున్నాయి.

సాధారణంగా బంగారం అంటే ఎవరికైనా ఎంతో ఇష్టం. ప్రపంచంలో బంగారం అంటే ఎంతో విలువైనదిగా చూస్తుంటారు. ముఖ్యంగా మహిళలకు బంగారు ఆభరణాలు ధరించేందుకు ఎంతగానో ఇష్టపడుతుంటారు. ఈ మధ్య బంగారం ధరలు క్రమంగా పెరుగుతూ.. తగ్గుతూ వస్తున్నాయి. గత రెండు నెలలు పసిడి ధరలు చాలా వరకు తగ్గాయి. కానీ మార్చి నెలలో మాత్రం చుక్కులు చూపిస్తూ వచ్చాయి. గత వారం రోజులుగా పసిడి ధరలు పెరుగుతూ వచ్చాయి. నిన్నటితో పోల్చుకుంటే నేడు బంగారం ధరలు తగ్గడం ఒకింత శుభవార్తే అన్నట్లు. నేడు మార్కెట్ లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

దేశంలో వేసవి కాలం వచ్చిందంటే పెళ్లిళ్లు.. ఇతర శుభకార్యాల సందడి మొదలైనట్టే. మహిళలు ఎక్కువగా శాతం జ్యులరీ షాపులకు క్యూ కడుతుంటారు. వెరైటీ ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతుంటారు. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న కీలక పరిణామాల కారణంగా బంగారం, వెండి ధరల్లో మార్పులు వస్తుంటాయని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. గత పదిరోజులుగా పసిడి ధరలు పెరుగుతూ.. తగ్గుతూ వచ్చాయి. నిన్నటితో పోల్చుకుంటే నేడు బంగారం ధర కాస్త తగ్గుముఖం పట్టింది. తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ లో నేటి గోల్డ్ రేటు ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.61,340 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,920 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.79,400 వద్ద కొనసాగుతుంది.

ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 61,490 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.67,080 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, బెంగుళూరు, కోల్‌కొతా, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.61,350 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.66,920 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.62,000 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.67,630వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో కిలో వెండి ధర రూ.76,200, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ.76,400 వద్ద ట్రెండ్ అవుతుంది. చెన్నై కిలో వెండి ధర రూ. 81,600లు ఉండగా, ఢిల్లీ లో రూ.76,400 వద్ద ట్రెండ్ అవుతుంది.

Show comments