P Krishna
ఇటీవల దేశంలో బంగారం ధరలు బాాగా పెరిగిపోయాయి. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేయడంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది.
ఇటీవల దేశంలో బంగారం ధరలు బాాగా పెరిగిపోయాయి. పండుగలు, పెళ్లిళ్లు ఇతర శుభకార్యాలకు మహిళలు ఎక్కువగా పసిడి కొనుగోలు చేయడంతో డిమాండ్ కూడా అదే స్థాయిలో పెరిగిపోయింది.
P Krishna
ఇటీవల దేశంలో బంగారం కోనుగోలు విపరీతంగా పెరిగిపోయింది. దీంతో పసిడి ధరలు అమాంతం పెరిగిపోతూ వచ్చాయి. గత ఏడాది చివర్లో పసిడి ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో ఈ ఏడాది మొదటి వారం నుంచి గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుందని భావించారు.. కానీ అదృష్టం కొద్ది తగ్గుముఖం పట్టింది. జనవరిలో సంక్రాంతి పండుగ, ఇతర శుభకార్యాలకు పసిడి కొనుగోలు పెరిగిపోయింది. మూడు రోజుల క్రితం పసిడి ధరలు కాస్త కంగారు పెట్టించినా.. మూడు రోజులుగా స్థిరంగా కొనసాగుతుంది. అంతర్జాతీయ మార్కెట్ లో జరుగుతున్న పరిణామాలను బట్టి ప్రతిరోజూ పసిడి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. మార్కెట్ లో నేడు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..
మహిళలకు శుభవార్త.. గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ సమయంలో పసిడి కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. వారం రోజుల క్రితం పండుగ సందర్భంగా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు వచ్చాయి. దీంతో పసిడి కొనాలా? వద్దా అన్న సందిగ్ధంలో పడిపోయారు. కానీ వరుసగా మూడు రోజుల నుంచి ధరలు స్థిరంగా కొనసాగుతున్న నేపథ్యంలో గోల్డ్ కొనుగోలు చేయడానికి మహిళలు సుముఖత చూపిస్తున్నారు. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు హైదరాబాద్, వరంగల్, విశాఖ, విజయవాడ లో నేటి పసిడి ధరలు 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,800 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 63,050 వద్ద కొనసాగుతుంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.500 తగ్గి ప్రస్తుతం రూ. 76,500 వద్ద ట్రెండ్ వుతుంది.
ఇక దేశంలోని ప్రధాన నగరాలు బంగారం, వెండి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,950 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,200 వద్ద కొనసాగుతుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబై, కోల్ కొతా, బెంగుళూరు, కేరళాలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 57,800 లు ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 63,050 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,300 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 63,600 వద్ద కొనసాగుతుంది. వెండి ధరలు స్థిరంగానే కొనసాగుతున్నాయి. చెన్నై, కేరళాలో రూ.76,500 లు ఉండగా, ఢిల్లీ, ముంబై, కోల్‌కొతాలో కిలో వెండి ధర రూ. 76,000, బెంగుళూరు లో కిలో వెండి ధర రూ. 73,000 వద్ద ట్రెండ్ అవుతుంది.