పసిడి ప్రియులకు షాక్.. నేడు ధరలు ఎంతంటే?

పసిడి ప్రియులకు షాక్.. నేడు ధరలు ఎంతంటే?

దేవంలో బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోవడంతో దిగుమతులు తక్కువ అవుతున్న క్రమంలో ధరలకు చెక్కలు వస్తున్నాయి. ఈ నెలలో వరుసగా బంగారం ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి.

దేవంలో బంగారం కొనుగోలు భారీగా పెరిగిపోవడంతో దిగుమతులు తక్కువ అవుతున్న క్రమంలో ధరలకు చెక్కలు వస్తున్నాయి. ఈ నెలలో వరుసగా బంగారం ధరలు పెరిగిపోతూ వస్తున్నాయి.

ప్రపంచంలో ఎక్కువ మంది ఇష్టపడేది బంగారం.. అందుకే బంగారానికి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. బంగారు ఆభరణాలు అంటే కేవలం మహిళలు మాత్రమే కాదు.. రక రకాల బ్రాస్లెట్, గోల్డ్ చైన్లు, రింగులు అంటే మగవారు కూడా ఎంతో ఇష్టపడుతుంటారు. ఇక పండుగలు, పెళ్లిళ్ల సీజన్ లో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. చాలా మంది బంగారం కొనుగోలు చేసేందుకు జ్యులరీ షాపులకు క్యూ కడుతున్న విషయం తెలిసిందే. ఇటీవల బంగారం ఎప్పుడు పెరుగుతుందో, ఎప్పుడు తగ్గుతుందో తెలియని పరిస్థితి. అందుకే పసిడి ధరలు స్థిరంగా ఉన్నపుడు.. గరిష్టంగా తగ్గినపుడు కొనుగోలు చేయడం మంచిదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో పసడి ధర రూ.63 వేలకు చేరుకుంది.. ఇది త్వరలో మరింత పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి ఈ రోజు కాస్త బ్యాడ్ న్యూస్ అనే చెప్పాలి.. గత వారం రోజుల నుంచి పసిడి ధరలు చుక్కలు చూపిస్తుంది. నిన్నటితో పోల్చుకుంటే పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. సాధారణంగా మార్కెట్ లో బంగారం డిమాండ్ ఎక్కువగా ఉండి.. దిగుమతి తక్కువగా ఉంటే ధరల్లో మార్పులు చోటు చేసుకుంటాయి. అంతర్జాతీయ మార్కెట్ లో జరిగే పరిణామాల ప్రభావం సైతం పసిడిపై పడుతుంది.. దీంతో తరుచూ ధరల్లో మార్పులు సంభవిస్తుంటాయి. తెలుగు రాష్ట్రాల్లో నేడు పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్నం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,820 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర రూ. 79,200 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,650 ఉండగా, 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.63,960 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 59,000 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.64,360 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు, కోల్‌కొతా లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 58,500 ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.63,820 వద్ద ట్రెండ్ అవుతుంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,500 ఉండగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.63,820 వద్ద ట్రెండ్ అవుతుంది. ఢిల్లీ, ముంబై, కోల్‌కొతా లో కిలో వెండి ధర రూ.79,500 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో కిలో వెండి ధర రూ. 81,000 వద్ద కొనసాగుతుంది. ధరలు తగ్గినపుడు బంగారం, వెండి కొనుగోలు చేస్తే మంచిదని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

Show comments