బడ్జెట్ ఎఫెక్ట్.. దారుణంగా పడిపోయిన పసిడి ధరలు.. ఈ రోజు ఎంతంటే?

Gold and Silver Rates: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పసిడి ధరలు దాదాపు ఐదు వేల వరకు పెరిగాయి. ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి. వరుసగా షాక్ ఇచ్చిన పసిడి, వెండి ధరలు బడ్జెట్ పుణ్యమా అని భారీగా తగ్గాయి.

Gold and Silver Rates: గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది పసిడి ధరలు దాదాపు ఐదు వేల వరకు పెరిగాయి. ఇటీవల బంగారం ధరలు ఎప్పుడు పెరుగుతున్నాయో.. ఎప్పుడు తగ్గుతున్నాయో తెలియని అయోమయ పరిస్థితి. వరుసగా షాక్ ఇచ్చిన పసిడి, వెండి ధరలు బడ్జెట్ పుణ్యమా అని భారీగా తగ్గాయి.

ప్రపంచంలో బంగారం అంటే ఇష్టపడని వారు అంటూ ఎవరూ ఉండరు. ఒంటిపై బంగారం ఉంటే ఆ దర్జానే వేరు. ఇక భారత దేశంలో మహిళలు పసిడి అంటే ఎంతగా ఇష్టపడతారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఆషాఢమాసం మొదలైంది.. ఇక వరుసగా పండుగలు, శుభకార్యాల సీజన్. జ్యులరీ షాపులు కిట కిటలాడుతున్నాయి. గత కొన్నిరోజులుగా వరుసగా పెరిగిపోతూ వస్తున్న పసిడి ధరలు వారం రోజులుగా నేల చూపు చూస్తున్నాయి. మొన్న 2024 వార్షిక బడ్జెట్ లో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశ పెట్టిన బడ్జెట్ లో బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించడంతో ధరలు భారీగా తగ్గాయి. వివరాల్లోకి వెళితే..

మంగళవారం కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2024 వార్షిక బడ్జెట్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. ఈ సందర్బంగా బంగారం దిగుమతులపై కస్టమ్స్ సుంకాన్ని తగ్గించారు. బడ్జెట్ కి ముందు నుంచి తగ్గుతూ వస్తున్న పసిడి ధరలు ఏకంగా రూ.4 వేల వరకు పడిపోయింది. ఇదే గోల్డెన్ ఛాన్స్.. బంగారం కొనాలనుకునే వారు ఇప్పడు ఖరీదు చేస్తే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.64,940కు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం పై రూ.10 తగ్గి, రూ.70,850 కు చేరింది. ఇక తెలుగు రాష్ట్రాలు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.64,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రూ.70,850 వద్ద కొనసాగుతుంది.

దేశంలోని ప్రధాన నగరాలు ఢిల్లీ 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.65,090 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.71,000 వద్ద కొనసాగుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.65,490ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.70,790 వద్ద కొనసాగుతుంది. ముంబై, కోల్‌కొతా, కేరళా, బెంగుళూరు లో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,940 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.70,850 వద్ద కొనసాగుతుంది. వెండి రేటు రూ.100 వరకు తగ్గింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ.91,900,ఢిల్లీ, ముంబై, పూనే,కోల్‌కొతాలో రూ.87,400, బెంగుళూరులో రూ.88,850వద్ద కొనసాగుతుంది.

Show comments