Today Gold&Silver Rate: పసిడి ప్రియులకు ఊరట.. నేడు ధర ఎంత ఉందంటే

పసిడి ప్రియులకు ఊరట.. నేడు ధర ఎంత ఉందంటే

ఈమధ్య కాలంలో బంగారం ధరలు ఆల్‌ టైమ్‌ గరిష్టాలకు చేరుకున్నాయి. ఇక త్వరలోనే పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుండటంతో పుత్తడికి భారీ డిమాండ్‌ ఉంటుంది. మరి నేడు గోల్డ్‌ రేటు ఎంత ఉంది అంటే..

ఈమధ్య కాలంలో బంగారం ధరలు ఆల్‌ టైమ్‌ గరిష్టాలకు చేరుకున్నాయి. ఇక త్వరలోనే పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం కానుండటంతో పుత్తడికి భారీ డిమాండ్‌ ఉంటుంది. మరి నేడు గోల్డ్‌ రేటు ఎంత ఉంది అంటే..

బంగారం ధరలు రాకెట్‌ వేగంతో దూసుకుపోతున్నాయి. రెండు రోజుల పాటు దిగి వచ్చిన ధర.. మళ్లీ పెరిగింది. దీపావళి, ఆ తర్వాత వివాహాల సీజన్‌ ప్రారంభం కానుండటంతో.. బంగారం ధరకు రెక్కలు వస్తున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ ప్రారంభం అయితే గోల్డ్‌కు భారీగా డిమాండ్‌ ఏర్పడుతుంది.. దాంతో ధరలు పెరిగే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికే వరుసగా రెండు సెషన్లలో పెరిగిన బంగారం ధర.. నేడు మాత్రం దిగి వచ్చింది. కనుక పుత్తడి కొనాలనుకునేవారు.. ఇప్పుడే త్వరపడితే మంచిది అంటున్నారు బులియన్‌ మార్కెట్‌ విశ్లేషకులు. మరి నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..

నేడు హైదరాబాద్‌ బులియన మార్కెట్లో బంగారం ధర దిగి వచ్చింది. భాగ్యనగరంలో ఆదివారం నాడు 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ.100 తగ్గి ప్రస్తుతం రూ. 56,500 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర 10 గ్రాముల మీద 110 తగ్గి ప్రస్తుతం రూ. 61,640 వద్ద ట్రేడింగ్ అవుతోంది. ఇక ఢిల్లీ బులియన్‌ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగి వచ్చింది. ఇవాళ హస్తినలో 22 క్యారెట్‌ బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 56,650కి వద్ద అమ్ముడవుతోంది. అలానే 24 క్యారెట్‌ ప్యూర్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 110 తగ్గి ప్రస్తుతం రూ. 61, 790 వద్ద కొనసాగుతోంది.

బంగారం బాటలోనే వెండి..

నేడు వెండి ధరలు కూడా బంగారం దారిలోనే పయణిస్తున్నాయి. ఆదివారంలోని దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఈ రోజు కిలో వెండి ధర రూ. 75,000గా ఉంది.ఢిల్లీలో కిలో వెండి ధర 75 వేల రూపాయల వద్ద ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర 78 రూపాయల వద్ద స్థిరంగా కొనసాగుతోంది.

Show comments