Gold&Silver Rate On Nov 29th 2023: బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. నేటి ధరలు ఇవే

బంగారం కొనాలనుకునే వారికి ఊరట.. నేటి ధరలు ఇవే

బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట కలిగించే వార్త ఇది. క్రితం సెషన్లో ధర పెరగ్గా.. నేడు మాత్రం స్థిరంగానే ఉంది. ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధర ఎంత ఉందంటే..

బంగారం కొనాలనుకునే వారికి కాస్త ఊరట కలిగించే వార్త ఇది. క్రితం సెషన్లో ధర పెరగ్గా.. నేడు మాత్రం స్థిరంగానే ఉంది. ఇవాళ దేశీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ ధర ఎంత ఉందంటే..

పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం అయ్యింది.. బంగారానికి భారీ డిమాండ్ ఉంటుంది. అయితే మన దగ్గర పసిడికి డిమాండ్ ఎక్కువ.. ఉత్పత్తి చాలా తక్కువ. మన దేశంలో వినియోగించే గోల్డ్ లో అధిక భాగం మన ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటాము. ప్రపంచంలో ఏ దేశం దగ్గర లేనంత బంగారం మన దగ్గర ఉంది. భారతీయులకు పుత్తడి అంటే కేవలం విలువైన లోహం మాత్రమే కాక.. అక్కరకు ఆదుకునే పెట్టుబడి.. కొందరికి స్టేటస్ చిహ్నం కూడా. అందుకే మనవాళ్లు.. పండగలు, వివాహాది శుభకార్యాల వేళ బంగారం కొనుగోలుకు ప్రధాన్యత ఇస్తారు. అయితే దీని ధర మాత్రం.. వరుసగా పెరుగుతూ 6 నెలల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుతం బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయని చెప్పవచ్చు. ఇక నేడు ధర ఎంత ఉంది అంటే..

ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది అంటే.. ధర తగ్గకపోయినా పర్లేదు కానీ.. ప్రతి రోజు పెరగకుండా ఉంటే అదే పది వేలు అని భావిస్తున్నారు. ఇక క్రితం సెషన్లో పెరిగిన గోల్డ్ రేటు.. నేడు మాత్రం.. స్థిరంగా ఉండి కాస్త ఊరట కలిగించింది. ఇక నేడు హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉంది. నేడు భాగ్యనగరంలో 22 క్యారెట్ గోల్డ్ పది గ్రాముల ధర రూ. 57,350 వద్దనే స్థిరంగా కొనసాగుతుంది. అలానే 24 క్యారెట్ మేలిమి బంగారం 10 గ్రాములు ధర రూ.62,560 వద్దనే ట్రేడవుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో కూడా బంగారం ధర స్థిరంగానే కొనసాగుతుంది. నేడు హస్తినలో 24 క్యారెట్ మేలిమి బంగారం ధర కిత్రం సెషన్లో ఉన్నంతనే ఉంది. అనగా పది గ్రాముల ధర రూ.62,560 వద్ద స్థిరంగా కొనసాగుతుంది. ఇక 22 క్యారెట్ బంగారం 10 గ్రాముల ధర నిన్న రూ. 57,350 ఉండగా.. నేడు కూడా అదే రేటు వద్ధ అమ్ముడవుతోంది.

బంగారం బాటలోనే వెండి..

నేడు దేశీయ మార్కెట్లో బంగారం ధర స్థిరంగా ఉండగా.. వెండి ధర కూడా అదే బాటలో పయనించింది. అయితే క్రితం సెషన్లో సిల్వర్ రేటు కిలో మీద ఏకంగా 1300 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే. అయితే నేడు మాత్రం వెండి రేటు పెరగలేదు. ఇక నేడు హైదరబాద్ బులియన్ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 81,500 వద్ద కొనసాగుతోంది. అలానే దేశ రాజధాని ఢిల్లీలో కూడా వెండి ధర క్రితం సెషన్ ధర వద్దనే అనగా.. 78,500 వద్ద స్థిరంగా కొనసాగుతుంది.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి. నిన్నటి సెషన్‌లో కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లి ఇవాళ ఏకంగా 30 డాలర్లకు పైగా పెరిగాయి. ప్రస్తుతం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 2048 డాలర్ల పైన కొనసాగుతుంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 25.12 డాలర్ల వద్ద ఉంది.

Show comments