Gold&Silver Rate On Aug 25th 2023: పండుగ పూట షాకిచ్చిన పసిడి ధర.. వరలక్ష్మీ వ్రతం రోజున ఎంత పెరిగిందంటే

పండుగ పూట షాకిచ్చిన పసిడి ధర.. వరలక్ష్మీ వ్రతం రోజున ఎంత పెరిగిందంటే

శ్రావణ శుక్రవారం.. అందునా వరలక్ష్మీ వ్రతం.. బంగారం కొనడానికి మహిళలకు ఇంతకు మించి మంచి అవకాశం ఏం ఉంటుంది. వరలక్ష్మీ వ్రతం రోజున బంగారం కొంటే.. లక్ష్మీ దేవి ఇంటికి తరలి వస్తుందని.. ఏడాదంతా ఇంట్లో సిరి సంపదలు కొలువైతాయని భారతీయ మహిళలు బలంగా నమ్ముతారు. పైగా ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు ఉంటాయి. దాంతో పసిడికి డిమండ్‌ భారీగా ఉండటంతో.. రేటు కూడా అదే స్థాయిలో పెరుగుతుంది. ఈ నెల ప్రారంభం నుంచి బంగారం ధర దిగి వచ్చింది. కానీ గత మూడు రోజులుగా మాత్రం.. పసిడి ధర పెరుగుతూనే ఉంది. ఇక నేడు వరలక్ష్మీ వ్రతం.. గోల్డ్‌కి చాలా డిమాండ్‌ ఉంటుంది. అయితే బంగారం కొందామనుకునేవారికి.. పసిడి ధరలు నేడు భారీ షాక్‌ ఇచ్చాయి. శుక్రవారం గోల్డ్‌ రేటు భారీగా పెరిగింది. ఇక శుక్రవారం ఢిల్లీ, హైదరాబాద్‌లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో వరుసగా నాలుగో రోజు కూడా గోల్డ్‌ రేటు పెరిగింది. ఈ నాలుగు సెషన్లలోనే ఏకంగా 10 గ్రాముల మీద రూ.400 పైన పెరిగింది. లిక నేడు హైదరాబాద్‌లో చూసుకుంటే.. 22 క్యారెట్‌ గోల్డ్ రేటు 10 గ్రాముల మీద రూ. 200 పెరిగి రూ. 54,500 మార్క్ వద్దకు చేరింది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 220 పెరిగి ప్రస్తుతం రూ. 59,450 వద్దకు చేరింది. ఇక ఢిల్లీలో కూడా బంగారం ధర పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ ఆభరణాల తయారీ గోల్డ్ రేటు రూ. 200 పెరిగి ప్రస్తుతం రూ. 54,650 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్‌ బంగారం రేటు 10 గ్రాముల మీద రూ. 200 పెరిగి రూ. 59,600 వద్దకు ఎగబాకింది.

ఒక్క రోజు రూ.1500 జంప్ చేసిన సిల్వర్‌ రేటు..

ఇక వెండి కూడా బంగారం బాటలోనే పయనిస్తోంది. ఇక నేడు ఒక్క రోజే.. వెండి ధర కిలో మీద ఏకంగా 1500 రూపాయలు పెరిగింది. ఇ‍క గత నాలుగు సెషన్లలో చూస్తే వెండి ధర కిలో మీద ఏకంగా రూ.3500 పెరిగింది. ఇక నేడు మన హైదరాబాద్ మార్కెట్లో చూసుకుంటే కిలో వెండి ధర రూ. 80 వేలకు చేరింది. ఢిల్లీ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.76,900 వద్ద ట్రేడ్‌ అవుతోంది. ఢిల్లీతో పోలిస్తే.. హైదరాబాద్‌లో వెండి రేటు ఎక్కువగా ఉంటుంది. ఇందుకు కారణం స్థానికంగా ఉండే పన్నులు.

Show comments