పసిడి ప్రియులకు షాక్.. ఒకేసారి పెరిగిన ధరలు!

గత కొంతకాలంగా పసిడి, వెండి పెరుగుతూ వస్తున్నాయే తప్ప ఎప్పుడూ తగ్గుదల అన్నదే లేకుండా పోయింది. ఒకటీ రెండు సార్లు స్థిరంగా కొనసాగినా.. మళ్లీ ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు.

గత కొంతకాలంగా పసిడి, వెండి పెరుగుతూ వస్తున్నాయే తప్ప ఎప్పుడూ తగ్గుదల అన్నదే లేకుండా పోయింది. ఒకటీ రెండు సార్లు స్థిరంగా కొనసాగినా.. మళ్లీ ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు.

దేశంలో బంగారం కొనేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. అదే సమయంలో పసిడి ధరలు తరుచూ పెరగడం, తగ్గడం జరుగుతుంది. సెప్టెంబర్ లో పసిడి ధరలు తగ్గుతూ వచ్చాయి.. నవంబర్ లో ఒకేసారి పెరిగిపోయాయి. గత నెల చివరి వారంలో పసిడి ధరలు కాస్త ఊరట ఇచ్చినా.. డిసెంబర్ 1న మళ్లీ పెరగడం మొదలైంది. ఈ రోజు బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. ఒకేరోజు తులానికి రూ.750 వరకు పెరిగిపోయింది. ఇక వెండి ధర కూడా షాక్ ఇస్తూ కిలో రూ.1000 మేర పెరిగింది. ప్రపంచంలో మార్కెట్ లో ఏర్పడిన మార్పుల ప్రభావం ఎక్కువగా గోల్డ్ పై పడుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్న విషయం తెలిసిందే. నేడు మార్కెట్ లో బంగారం, వెండి ధరల విషయానికి వస్తే..

ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా బంగారం దిగుమతి చేసుకుంటున్న దేశాల్లో భారత కూడా ఒకటి. ఇక్కడ పండుగలు, శుభకార్యాలకు బంగారు ఆభరణాలకు కొనుగోలు చేయడానికి మహిళలు ఎక్కువగా ఉత్సాహం చూపిస్తుంటారు. అంతేకాదు బంగారం కొని దగ్గర ఉంచుకుంటే ఏ ఆపదలో అయినా పనికి వస్తుందన్న నమ్మకం. ఈ మద్య కాలంలో అప్పుడప్పుడు తగ్గుతూ.. ఒకేరోజు భారీ షాక్ ఇస్తుంది పసిడి. ప్రస్తుతం మార్కెట్ లో బంగారం ధరలు రికార్డు గరిష్ట స్థాయికి చేరాయి. హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖ పట్నం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.58,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,760 వరకు చేరింది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ధర రూ. 80,500 రూపాయల వద్ద కొనసాగుతోంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో పసడి ధరల విషయానికి వస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.58,600 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.63,910 వద్ద ట్రెండ్ అవుతుంది. బెంగుళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల పసడి రేటు రూ. 58,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి రేటు రూ.63,760 వద్ద కొనసాగుతుంది. ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 58,450 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.63,760 వద్ద కొనసాగుతుంది. కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరల రూ.58,450 వద్ద ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.63,760 వద్ద ట్రెండ్ అంవుతుంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.59,150 గా ఉంది. ఇక 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.64,530 వద్ద ట్రెండ్ అవుతుంది. ఇక సిల్వర్ రేటు కూడా భారీగానే పెరిగింది. కిలో వెండి ధరపై ఏకంగా వెయ్యి రూపాయల మేర పెరిగింది. ప్రస్తుతం మార్కెట్ లో కిలో వెండి ధర రూ.80,500 వద్ద కొనసాగుతుంది. బెంగుళూరు లో మాత్రం కిలో వెండి ధర రూ. 79,000 వద్ద కొనసాగుతుంది.

Show comments