Gold&Silver Rate On Aug 30th 2023: బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన ధర

బంగారం కొనాలనుకునే వారికి బ్యాడ్‌ న్యూస్‌.. భారీగా పెరిగిన ధర

భారతీయులకు బంగారం అంటే ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన దేశంలో బంగారం అంటే కేవలం విలువైన లోహం మాత్రమే కాదు.. అచ్చంగా లక్ష్మీ దేవి స్వరూపం. చేతిలో రూపాయి లేకపోయినా సరే.. ఒంటి మీద ఎంతో కొంత బంగారం ఉంటే.. చాలు.. అక్కరకు ఆదుకుంటుంది అనే భరోసా. అందుకే సందర్భం వచ్చిన ప్రతి సారి భారతీయులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపుతారు. అయితే ఈ ఏడాది బంగారం ధర స్థిరంగా లేదు. ఇప్పటికే రెండు సార్లు.. గరిష్టాలకు చేరిన గోల్డ్‌ రేటు.. ఆగస్ట్‌ నెలలో ఎక్కువ రోజుల పాటు దిగి వచ్చింది. అయితే శ్రావణమాసం ప్రారంభం నుంచి మాత్రం బంగారం ధర.. రాకెట్‌ వేగంతో దూసుకుపోతుంది. ఇక నేడు కూడా బంగారం ధర భారీగా పెరిగి.. ఒక్కసారిగా షాకిచ్చింది. నేడు హైదరాబాద్‌, ఢిల్లీలో బంగారం ధర ఎంత పెరిగిందంటే..

నేడు హైదరాబాద్‌లో బంగారు ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్ రేటు ఒక్కరోజులోనే రూ.250 పెరగి.. ప్రస్తుతం 10 గ్రాముల ధర రూ.54,700 వద్ద ట్రేడవుతోంది. ఇక 24 క్యారెట్‌ మేలిమి బంగారం ధర రూ. 270 పెరిగి.. రూ.59,670 మార్క్‌ వద్ద ట్రేడవుతోంది. ఇక దేశరాజధాని ఢిల్లీలో కూడా నేడు పుత్తడి ధర భారీగానే పెరిగింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ పసిడి రేటు రూ.250 పెరిగి 10 గ్రాములు రూ.54,850 వద్ద ట్రేడవుతోంది. అలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల మీద రూ.270 ఎగబాకి రూ.54,850 పలుకుతోంది.

బంగారం బాటలోనే వెండి ధర..

బంగారం ధరలు పెరిగిన నేపథ్యంలో నేడు వెండి ధర కూడా భారీఆనే పెరిగింది. నేడు ఢిల్లీ మార్కెట్‌లో కేజీ సిల్వర్ రేటు రూ.200 పెరిగి రూ.77,100 వద్ద ట్రేడవుతోంది. అయితే హైదరాబాద్‌లో మాత్రం వెండి ధర మాత్రం స్థిరంగానే ఉంది. నేడు భాగ్యనగరంలో కిలో వెండి ధర రూ.80 వేలు పలుకుతోంది. వరుసగా 3 రోజులుగా హైదరాబాద్‌లో వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేకపోవడం గమనార్హం. ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 1936 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇదే సమయంలో స్పాట్ సిల్వర్ రేటు చూస్తే 24.67 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Show comments