Gold&Silver Rate On Nov 9th 2023: బంగారం కొనాలనుకునేవారికి భారీ శుభవార్త.. ఎంత తగ్గిందంటే

బంగారం కొనాలనుకునేవారికి భారీ శుభవార్త.. ఎంత తగ్గిందంటే

బంగారం కొనాలనుకునేవారికి ఇది భారీ శుభవార్త. ఐదు రోజుల నుంచి గోల్డ్‌ రేటు దిగి వస్తోంది. ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

బంగారం కొనాలనుకునేవారికి ఇది భారీ శుభవార్త. ఐదు రోజుల నుంచి గోల్డ్‌ రేటు దిగి వస్తోంది. ఇక నేడు దేశీయ బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధర ఎంత ఉంది అంటే..

భారతీయుల దృష్టిలో బంగారం అంటే కేవలం ఆభరణాల తయారీకి ఉపయోగించే ఖరీదైన లోహం మాత్రమే కాదు.. లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తారు. అందుకే చాలా మంది.. పండగల వేళ గోల్డ్‌ కొనడానికి ఆసక్తి చూపుతారు. పండగ పూట లక్ష్మీ దేవిని ఇంటికి తీసుకువస్తే.. కలసి వస్తుందని నమ్ముతారు. దాంతో గోల్డ్‌కి భారీగా డిమాండ్‌ ఉంటుంది. దాంతో రేటు పెరుగుతుంది. పండగలు, వివాహాది శుభకార్యాల సీజన్‌లో పుత్తడికి డిమాండ్‌ భారీగా ఉండటంతో.. రేటు కూడా అలానే పెరుగుతుంది.

దీపావళి ముందు వచ్చే ధన్‌తెరాస్‌ వేళ పసిడి కొనుగోలు చేస్తారు చాలా మంది. అయితే ఈ ఏడాది ధన్‌తేరాస్‌ సందర్భంగా కనకం కొనాలనుకునేవారికి ఇది మంచి శుభవార్త అని చెప్పవచ్చు. గత రెండు మూడు రోజులుగా దిగి వస్తోన్న గోల్డ్‌ రేటు నేడు కూడా తగ్గింది. ఇక నేడు బంగారం ధర ఎంత ఉంది అంటే..

నేడు దేశీయ మార్కెట్‌లో బంగారం ధర దిగి వచ్చింది. ఇవాళ భాగ్యనగరంలో ఆభరణాల తయారీకి వినియోగించే 22 క్యారెట్‌ గోల్డ్‌ రేటు పది గ్రాముల మీద రూ. 150 తగ్గింది. దాంతో నేడు హైదరాబాద్‌లో 22 క్యారెట్‌ గోల్డ్‌ 10 గ్రాముల ధర రూ. 56,100 వద్ద కొనసాగుతోంది. ఇలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన మేలిమి బంగారం రేటు కూడా నేడు దిగి వచ్చింది. నేడు హైదరాబాద్‌లో 24 క్యారెట్‌ పసిడి రేటు పది గ్రాముల మీద రూ. 160 దిగొచ్చి రూ. 61,200 వద్ద ట్రేడవుతోంది.

ఇక దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో సైతం నేడు గోల్డ్‌ రేటు దిగి వచ్చింది. నేడు హస్తినలో 22 క్యారెట్‌ పుత్తడి ధర 10 గ్రాముల మీద రూ. 150 పడిపోయి రూ. 56,250 వద్ద అమ్ముడవుతోంది. ఇలానే 24 క్యారెట్‌ స్వచ్ఛమైన బంగారం ధర 10 గ్రాముల మీద రూ. 160 తగ్గి రూ. 61,350 వద్ద ఉంది. ఇక దేశీయ బులియన్‌ మార్కెట్‌లో గోల్డ్‌ రేటు వరుసగా గత ఐదు రోజుల నుంచి దిగి వస్తోంది. ఈ 5 రోజుల వ్యవధిలో గోల్డ్‌ రేటు రూ. 500 వరకు దిగి వచ్చింది.

బంగారం బాటలోనే వెండి.

క్రితం సెషన్‌లో సిల్వర్‌ రేటు దిగి రాగా.. నేడు కూడా పడిపోయింద. ఇక నేడు ఢిల్లీలో వెండి రేటు కిలో మీద రూ. 1000 దిగొచ్చింది. దాంతో ప్రస్తుతం హస్తినలో కిలో సిల్వర్‌ రేటు ఇప్పుడు రూ. 73,500 వద్ద ట్రేడవుతోంది. ఇక హైదరాబాద్‌లో కూడా వెండి ధర కిలో మీద రూ. 1000 పతనమై రూ. 76,500 వద్ద ఉంది. క్రితం సెషన్‌లో సిల్వర్‌ రేటు కిలో మీద 700 రూపాయలు తగ్గిన సంగతి తెలిసిందే.

ఇక అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా బంగారం ధర దిగి వచ్చింది. నేడు ఇంటర్నేషనల్ బులియన్‌ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ రేటు ప్రస్తుతం ఔన్సుకు 1954 డాలర్ల వద్ద అమ్ముడవుతోంది. అలానే స్పాట్ సిల్వర్ ధర 22.66 డాలర్ల వద్ద కొనసాగుతోంది. యూఎస్‌ ఫెడ్ ఇటీవల వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. దాంతో డాలర్‌ రేటు పుంజుకుంటూ.. గోల్డ్‌ రేటు దిగి వస్తోంది.

Show comments